Telugu Global
National

ఈ ఆదర్శ దంపతుల రూటే సెపరేటు.... ఎన్నికల్లో కలిసి పోటీ !

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ గెలవడానికి ఉన్న మార్గాలన్నీ చూస్తుంటాయి. కాని కొంత మంది ఉంటారు. వారికి ఎన్నికలు అంటే సరదా. తమ ఓటు వేరే వాళ్లకి ఎందుకు వేయాలి..? నా ఓటు నాకే వేసుకుంటా.. లక్కుంటే అసెంబ్లీలో అధ్యక్షా అని కూడా అనొచ్చనే ఆశతో ఉంటారు. కాని ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తి రూటు మాత్రం సెపరేటు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో స్వరూప్ చంద్ గెహ్లాట్ అనే […]

ఈ ఆదర్శ దంపతుల రూటే సెపరేటు.... ఎన్నికల్లో కలిసి పోటీ !
X

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ గెలవడానికి ఉన్న మార్గాలన్నీ చూస్తుంటాయి. కాని కొంత మంది ఉంటారు. వారికి ఎన్నికలు అంటే సరదా. తమ ఓటు వేరే వాళ్లకి ఎందుకు వేయాలి..? నా ఓటు నాకే వేసుకుంటా.. లక్కుంటే అసెంబ్లీలో అధ్యక్షా అని కూడా అనొచ్చనే ఆశతో ఉంటారు. కాని ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తి రూటు మాత్రం సెపరేటు.

రాజస్థాన్‌లోని బికనీర్‌లో స్వరూప్ చంద్ గెహ్లాట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని భార్య పేరు మంజులతా గెహ్లట్. వీరికి ముగ్గరు పిల్లలు. వారందరినీ మంచిగా చదివించి పెళ్లిళ్లు కూడా చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దంపతులు బాధ్యతలు అన్నీ తీర్చుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

కాని స్వరూప్ చంద్‌కు ఒక అలవాటు ఉంది. బికనీర్‌లో ఏ ఎన్నికలు జరిగినా నామినేషన్ వేయడం అలవాటు. తొలి సారిగా 1988లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఇక అప్పటి నుంచి గత ముపై ఏళ్లుగా ప్రతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడం అలవాటు అయ్యంది. ఏదో సరదాగా నామినేషన్ వేసి ఊరుకోడు. తన స్కూటర్‌పై వీధులన్నీ తిరిగి ప్రచారం చేసుకుంటాడు. ఇంటింటికీ వెళ్లి ఓటు వెయ్యాలని కోరతాడు.

ఇలా 30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయానా… అని ఏనాడూ నిరాశ చెందలేదు. కాని తన ఎన్నికల ప్రచారానికి తన భార్య రావడం లేదని బాధ పడేవాడు. ఎన్ని సార్లు రమ్మని అడిగినా మంజులత మాత్రం ప్రచారానికి వచ్చేది కాదు. దీంతో ఈ సారి ఒక అద్భుతమైన ఐడియాను ప్రయోగించాడు.

తనతో పాటు తన భార్యతో కూడా నామినేషన్ వేయించాడు. ఇద్దరూ బికనీర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. భార్యా భర్తలు ఇద్దరూ ఒకే స్థానంలో పోటీ పడుతుండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందారు. అసలెందుకు వీళ్లిద్దరూ నామినేషన్ వేశారని ఆరా తీశారు. తీరా తన భార్యను వెంట తిప్పుకోవడానికే ఇలా నామినేషన్ వేశాడని.. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులని తేలడంతో ప్రత్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రతీ రోజు ఉదయం ఇద్దరూ స్కూటర్‌పై కలిసే వెళ్తున్నారు. ఇద్దరిలో ఎవరికి ఓటేసినా ఓకే అని.. ఎవరు గెలిచిన ఇంకొకరికి సహకరిస్తామని ఓటర్లకు చెబుతున్నారు. వీరి స్టోరీ మీడియాలో రావడంతో ఒక్క సారిగా బికనీర్‌లో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం బికనీర్‌లో ఈ భార్యాభర్తల స్టోరీనే హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  22 Nov 2018 10:45 PM GMT
Next Story