Telugu Global
National

ఇవి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు " సోనియా

తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేయాలని తెలంగాణ ఇస్తే… టీఆర్‌ఎస్ పాలన మాత్రం అందుకు తగ్గట్టుగా సాగలేదని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌-టీడీపీ-టీజేఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించిన సోనియాగాంధీ… ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ఇచ్చామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను టీఆర్‌ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు ఇంకా తన కళ్ల ముందే కదులుతోందన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా రాహుల్‌, మన్మోహన్ సింగ్ సాయంతో […]

ఇవి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు  సోనియా
X

తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేయాలని తెలంగాణ ఇస్తే… టీఆర్‌ఎస్ పాలన మాత్రం అందుకు తగ్గట్టుగా సాగలేదని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు.

మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌-టీడీపీ-టీజేఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించిన సోనియాగాంధీ… ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ఇచ్చామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను టీఆర్‌ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు.

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు ఇంకా తన కళ్ల ముందే కదులుతోందన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా రాహుల్‌, మన్మోహన్ సింగ్ సాయంతో తెలంగాణను సాకారం చేశామన్నారు.

ఏపీ ప్రజలు నష్టపోకూడదని ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చామన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు ఎలా పోరాటం చేశారో… ఇప్పుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా అదే స్థాయిలో పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సోనియా.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు వాటి కోసమే ఆత్మహత్యలు జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ గడ్డపైకి అడుగు పెడితే తనకు సొంత అమ్మ వద్దకు వచ్చినట్టుగా ఉందని సోనియా వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సోనియా చెప్పారు. టీఆర్‌ఎస్‌కు సరైన బుద్ది చెప్పి… కాంగ్రెస్‌ కూటమికి ఓటేయాలని కోరారు.

First Published:  23 Nov 2018 11:17 AM GMT
Next Story