Telugu Global
National

నదిలో బస్సు బోల్తా.... 25 మంది జలసమాధి

కర్నాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి బోల్తా పడిన సంఘటనలో 20 మందికి పైగా జల సమాధి అయ్యారు. కొంతసేపటిలో గమ్యం చేరుకోబోతుండగా జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని పాండవపుర నుంచి శనివారం మండ్య పట్టణానికి 30 మందికి పైగా ప్రైవేటు బస్సులో బయల్దేరారు. కనగరమరళి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని […]

నదిలో బస్సు బోల్తా.... 25 మంది జలసమాధి
X

కర్నాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి బోల్తా పడిన సంఘటనలో 20 మందికి పైగా జల సమాధి అయ్యారు. కొంతసేపటిలో గమ్యం చేరుకోబోతుండగా జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని పాండవపుర నుంచి శనివారం మండ్య పట్టణానికి 30 మందికి పైగా ప్రైవేటు బస్సులో బయల్దేరారు. కనగరమరళి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు మీద నుంచి కిందకు దిగింది. ఒక్కసారిగా టైరు జారి పక్కనే ఉన్న నది కాలువలోకి బోల్తా పడింది. 12 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.

నిమిషాల్లోనే బస్సు కాల్వలోకి జారుకోవడంతో, ఊపిరి ఆడక 20 మంది మృత్యువాతపడ్డారు. సమీప గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంలో బాధితులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. రోడ్డుకు, నదికాలువ మధ్య రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు. గతంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని, అధికారులు స్పందించకపోవడం వల్లే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే స్పందించారు. పోలీసు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. స్థానిక గ్రామస్థులు, అగ్నిమాక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

First Published:  24 Nov 2018 4:45 AM GMT
Next Story