Telugu Global
National

రగులుతున్న అయోధ్య.... అక్కడ రేపు ధర్మ సభ

అనుకున్నట్టే అయ్యింది. బీజేపీ ప్రోద్బలంతో హిందుత్వ వాదులు మళ్లీ అయోద్య తేనెతుట్టెను కదలించారు. రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో వీహెచ్‌పీ ధర్మ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ-ముస్లింల సున్నితమైన స్థలమైన బాబ్రీ మసీదును అప్పట్లో హిందుత్వ వాదులు కూలగొట్టారు. అది రామజన్మ భూమి అని అక్కడ రామ మందిరం నిర్మించాలని ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, శివసేన లాంటి హిందుత్వ సంస్థలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ సుప్రీం కోర్టు పరిధిలో […]

రగులుతున్న అయోధ్య....  అక్కడ రేపు ధర్మ సభ
X

అనుకున్నట్టే అయ్యింది. బీజేపీ ప్రోద్బలంతో హిందుత్వ వాదులు మళ్లీ అయోద్య తేనెతుట్టెను కదలించారు. రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో వీహెచ్‌పీ ధర్మ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హిందూ-ముస్లింల సున్నితమైన స్థలమైన బాబ్రీ మసీదును అప్పట్లో హిందుత్వ వాదులు కూలగొట్టారు. అది రామజన్మ భూమి అని అక్కడ రామ మందిరం నిర్మించాలని ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, శివసేన లాంటి హిందుత్వ సంస్థలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ సుప్రీం కోర్టు పరిధిలో ఈ విషయం ఉండడంతో ఇన్నాళ్లు వీలు పడలేదు.

కాగా ఇప్పుడు వీహెచ్‌పీ మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. యూపీలోని అయోధ్యలో ధర్మ సభ నిర్వహణకు పూనుకుంది. దీనికి శివసేన పూర్తి మద్దతు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రోద్బలంతోనే వీహెచ్‌పీ ముందుకెళ్తోందని సమాచారం. 20 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూలగొట్టామని…. తమకు చాన్స్ ఇస్తే రామమందిరాన్ని నిర్మిస్తామని శివసేన చీఫ్ ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అయోధ్యలో హిందుత్వవాదుల ధర్మసభపై యూపీలోని ప్రతిపక్ష సమాజ్ వాది అధినేత అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉంది కదా అని బీజేపీ అయోధ్య పేరుతో నాటాకాలాడుతోందని.. అంతిమంగా హిందూ-ముస్లిం మత కల్లోలాలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందే బీజేపీ ఎత్తుగడను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాగా అయోధ్యలో వీహెచ్‌పీ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఇద్దరు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, 700 మంది పోలీసులు , 4 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లను మోహరించారు. అయోధ్యలో వీహెచ్‌పీ ర్యాలీని అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అయోధ్యలో రేపటి సభతో ఏం జరుగుతుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

First Published:  24 Nov 2018 12:35 AM GMT
Next Story