కుక్కను రేప్‌ చేసి చంపేశారు

లైంగిక వేధింపులలో భారతదేశం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటిదాకా అనేక అమానుషమైన లైంగిక వేధింపులను చూశాం. ఇప్పుడు ముంబైలో మరో కొత్త రకం లైంగిక దాడి వెలుగులోకి వచ్చింది.

నలుగురు దుండగులు మద్యం మత్తులో ఊగిపోతూ అక్కడ వాళ్ళకు కనిపించిన ఒక కుక్కను పట్టుకుని, దాని నోరు కట్టేసి, దాన్ని బంధించి దానిపై ఆ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అకృత్యాన్ని ఆపడానికి ఒక రిక్షావాలా ప్రయత్నించినా అతన్నీ తిట్టి, తన్ని అక్కడి నుంచి తరిమేశారు.

గాయాలతో, తీవ్ర రక్త స్రావంతో స్పృహ తప్పిన ఆ శునకాన్ని మరునాడు అక్కడి స్థానిక మహిళ గుర్తించింది. రోజుటిలాగే ఆ రోజు కూడా ఆ కుక్కకు అన్నం పెట్టడానికి వచ్చిన ఆమె దాన్ని ఆ స్థితిలో చూసి వెంటనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆ శునకాన్ని ఆ స్థితిలో చూసిన వెటర్నరీ డాక్టర్లు షాక్‌ అయ్యారట. వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ తీవ్రంగా గాయపడ్డ ఆ శునకం మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిందట. ఈ ఘటన ముంబైలో ఈ వారం జరిగింది.

ఇలాంటి ఘటనలు చూసే అమెరికా, అనేక యూరప్ దేశాల యాత్రికులు ఇండియా అంటే భయపడుతున్నారు. మనదేశంలాంటి గొప్ప దేశం ప్రపంచంలో లేదని చంకలు గుద్దుకోవడం తప్ప గత కొంత కాలం నుంచి చెలరేగిపోతున్న కామాంధులను, లైంగిక దాడులను ప్రభుత్వాలు నిరోధించలేకపోవడం విషాదం.