Telugu Global
Cinema & Entertainment

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న "వినయ విధేయ రామ"

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “వినయ విధేయ రామ”. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను 2019 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు నిర్మాతలు. ఇకపోతే డిసెంబర్ […]

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న వినయ విధేయ రామ
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా “వినయ విధేయ రామ”. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను 2019 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు నిర్మాతలు. ఇకపోతే డిసెంబర్ 1 నుంచి హైదరాబాద్ లో భారీ సెట్ లో ఓ పాట చిత్రీకరించబోతున్నారట.

ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ “క్రేజీ కాంబినేషన్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో టైటిల్ “వినయ విధేయ రామ” అని అనౌన్స్ చెయ్యగానే చాలామంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టీజర్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విషయానికి వస్తే టాకీ పార్ట్ పూర్తయింది. హైదరాబాద్ లో భారీ సెట్ ను వేసి అందులో డిసెంబర్ 1 నుంచి ఐటెం సాంగ్ ని తెరకెక్కించనున్నాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతున్నాం” అని చెప్పాడు.

First Published:  23 Nov 2018 11:44 PM GMT
Next Story