Telugu Global
NEWS

మహిళా టీ-20 ప్రపంచకప్ లో టైటిల్ సమరం

టైటిల్ నీదా నాదా అంటున్న ఆసీస్, ఇంగ్లండ్ మూడుసార్లు ప్రపంచ విజేత ఆస్ట్రేలియా 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి…ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ విండీస్, భారతజట్ల టైటిల్ వేట … సెమీఫైనల్స్ పరాజయాలతో ముగియటంతో…మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా, 3వ ర్యాంకర్ ఇంగ్లండ్ జట్లు… టైటిల్ రేస్ లో మిగిలాయి. తొలి సెమీఫైనల్లో విండీస్ ను 71 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ఆస్ట్రేలియా, రెెండోసెమీస్ […]

మహిళా టీ-20 ప్రపంచకప్ లో టైటిల్ సమరం
X
  • టైటిల్ నీదా నాదా అంటున్న ఆసీస్, ఇంగ్లండ్
  • మూడుసార్లు ప్రపంచ విజేత ఆస్ట్రేలియా

2018 మహిళా టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి…ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

డిఫెండింగ్ చాంపియన్ విండీస్, భారతజట్ల టైటిల్ వేట … సెమీఫైనల్స్ పరాజయాలతో ముగియటంతో…మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా, 3వ ర్యాంకర్ ఇంగ్లండ్ జట్లు… టైటిల్ రేస్ లో మిగిలాయి.

తొలి సెమీఫైనల్లో విండీస్ ను 71 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ఆస్ట్రేలియా, రెెండోసెమీస్ లో భారత్ ను 8 వికెట్లతో అధిగమించడం ద్వారా ఇంగ్లండ్ ….టైటిల్ ఫైట్ కు అర్హత సంపాదించాయి.

హాట్ ఫేవరెట్ ఆసీస్….

ఈ పోటీ భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం…. 5-30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

2009 నుంచి 2018 వరకూ….

కేవలం తొమ్మిదేళ్ల క్రితం నుంచి మహిళలకు సైతం…టీ-20 ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తూ వస్తోంది. 2009లో లండన్ వేదికగా తొలిసారిగా మహిళా టీ-20 ప్రపంచకప్ ను నిర్వహించారు.

2009 లో ప్రారంభమైన మహిళా ప్రపంచకప్ లో…గత తొమ్మిదేళ్ల కాలంలోనే ఐదు ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల షోగానే సాగుతూ వస్తోంది.

తొలివిజేత ఇంగ్లండ్….

ఇంగ్లండ్ వేదికగా 2009లో నిర్వహించిన ప్రారంభ ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

2010 ప్రపంచకప్ నుంచి 2014 ప్రపంచకప్ వరకూ నిర్వహించిన మూడుటోర్నీల్లోనూ…ఆస్ట్రేలియా విజేతగా నిలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. మహిళా ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా మూడు ప్రపంచకప్ లు నెగ్గిన ఏకైకజట్టుగా చరిత్ర సృష్టించింది.

విండీస్ వండర్ విన్….

ఆ తర్వాత…భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్ లో మాత్రం… తొలిసారిగా టైటిల్ నెగ్గడం ద్వారా వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఆధిపత్యానికి కరీబియన్ మహిళలు తొలిసారిగా గండి కొట్టి… తమకు తామే సాటిగా నిలిచారు.

గత ఐదు మహిళా ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆస్ట్రేలియా మూడుసార్లు, ఇంగ్లండ్, విండీస్ ఒక్కోసారి టైటిల్ నెగ్గితే… న్యూజిలాండ్, ఇంగ్లండ్ చెరో రెండుసార్లు, ఆస్ట్రేలియా ఒకసారి రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్నాయి.

మహిళా టీ-20 ప్రపంచకప్ అంటే …ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల… మూడుస్తంభాలాట మాత్రమే కాదని… నాలుగోస్తంభం రూపంలో తామూ ఉన్నామని…. 2016 ప్రపంచకప్ సాధించడం ద్వారా…. కరీబియన్ మహిళలు చాటుకొన్నారు.

ఫైనల్లో ఐదోసారి….

ప్రపంచకప్ ఫైనల్స్ కు వరుసగా ఐదోసారి చేరిన ఆస్ట్రేలియా…. నాలుగో టైటిల్ కు ఉరకలేస్తోంది. గత టోర్నీ ఫైనల్లో విండీస్ చేతిలో ఎదురైన ఓటమికి…. ప్రస్తుత టోర్నీ సెమీస్ లోనే కంగారూ టీమ్ బదులు తీర్చుకొంది.

ఇంగ్లండ్ తో జరిగే టైటిల్ సమరంలో ఆస్ట్రేలియా అత్యుత్తమంగా రాణించగలిగితేనే…. నాలుగోసారి విజేతగా నిలువగలుగుతుంది.

First Published:  24 Nov 2018 4:14 AM GMT
Next Story