అంబరీష్ కన్నుమూత….

కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్ కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు ఆయన్ను బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంబరీష్‌ రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ అలనాటి హీరోయిన్‌ సుమలతను ఆయన వివాహమాడారు.

అంబరీష్ ఎంపీగా ఎన్నికై మన్మోహన్‌ సింగ్ హయాంతో కొద్దికాలం పాటు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. పలుమార్లు కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. శాండల్‌వుడ్‌లో అంబరీష్‌కు రెబెల్‌స్టార్‌గా పేరుంది.