Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్, ప్రభాస్ ల కోరికను తీర్చేదెవరో?

ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ కలిసి తమ కెరీర్ మొదట్లో “వర్షం” సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా నటించాడు. అయితే హీరోగా బ్రేక్ రావడంతో ఇక విలన్ వేషాలు ఆపేసి హీరో గా కంటిన్యూ అయ్యాడు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ తన తదుపరి సినిమాలకి రెడీ అవుతున్నాడు. కానీ గోపీచంద్ కి ఒక తీరని కోరిక ఉందట. అదేంటంటే ప్రభాస్ తో కలిసి మల్టీ స్టారర్ లో […]

గోపీచంద్, ప్రభాస్ ల కోరికను తీర్చేదెవరో?
X

ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ కలిసి తమ కెరీర్ మొదట్లో “వర్షం” సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే గోపీచంద్ విలన్ గా నటించాడు. అయితే హీరోగా బ్రేక్ రావడంతో ఇక విలన్ వేషాలు ఆపేసి హీరో గా కంటిన్యూ అయ్యాడు గోపీచంద్.

ప్రస్తుతం గోపీచంద్ తన తదుపరి సినిమాలకి రెడీ అవుతున్నాడు. కానీ గోపీచంద్ కి ఒక తీరని కోరిక ఉందట. అదేంటంటే ప్రభాస్ తో కలిసి మల్టీ స్టారర్ లో నటించడం.

గోపీచంద్ ఎప్పటి నుంచో ప్రభాస్ తో కలిసి మల్టీ స్టారర్ లో నటించాలని అనుకుంటున్నాడట. కానీ అది ప్రభాస్ కి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కుదరడం లేదట.

ఎవరైనా సరైన కథ పట్టుకొని వస్తే ప్రభాస్ తో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నాడు గోపీచంద్. ప్రభాస్ కూడా చాలా కార్యక్రమాల్లో గోపీచంద్ తో కలిసి నటించాలని ఉంది అని చెప్పాడు. మరి వీళ్ళిద్దరి కోసం పవర్ ఫుల్ కథని ఏ డైరెక్టర్ తీసుకొని వస్తాడో చూడాలి.

First Published:  25 Nov 2018 5:25 AM GMT
Next Story