Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ బయోపిక్ లో 'ఆర్ఎక్స్ 100' భామ

“RX 100” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో తను చేసిన నటనతో యావత్ యువతను తన వైపు తిప్పుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ కి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించమని ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో ఇప్పటికే తెలుగు నటులని చాలా మందిని ఎంపిక చేసి షూటింగ్ జరుపుతున్నారు. కానీ జయసుధ పాత్రకి మాత్రం తగిన నటి దొరకలేదని ఆ షూటింగ్ పార్ట్ ను […]

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆర్ఎక్స్ 100 భామ
X

“RX 100” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో తను చేసిన నటనతో యావత్ యువతను తన వైపు తిప్పుకుంది.

అయితే ఇప్పుడు ఈ భామ కి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించమని ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో ఇప్పటికే తెలుగు నటులని చాలా మందిని ఎంపిక చేసి షూటింగ్ జరుపుతున్నారు. కానీ జయసుధ పాత్రకి మాత్రం తగిన నటి దొరకలేదని ఆ షూటింగ్ పార్ట్ ను ఆపారట సినిమా యూనిట్.

ఇక ఇటీవలే బాలకృష్ణ పాయల్ రాజ్ పుత్ ఫొటోలు చూసి డైరెక్టర్ క్రిష్ కి ఈ అమ్మాయి జయసుధ పాత్రలో నటిస్తే బాగుంటుంది అని చెప్పాడట. డైరెక్టర్ క్రిష్ కూడా పాయల్ రాజ్ పుత్ జయసుధ పాత్రకి సరిపోతుందని ఆ పాత్రకి ఫైనల్ చేసాడట. త్వరలో పాయల్ రాజ్ పుత్, బాలక్రిష్ణ పై సీన్స్ ని షూట్ చేస్తాడట బాలక్రిష్ణ. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  25 Nov 2018 12:37 AM GMT
Next Story