Telugu Global
Cinema & Entertainment

చరణ్ నిర్మాత.... అఖిల్ హీరో

రామ్ చరణ్, అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అందుకే తన ఫ్రెండ్ కోసం సినిమా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. అఖిల్ హీరోగా తన బ్యానర్ పై ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుంది. రామ్ చరణ్ కు ఆల్రెడీ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై ఇప్పటికే ఖైదీ నంబర్ 150 తీశాడు. ప్రస్తుతం సైరా […]

చరణ్ నిర్మాత.... అఖిల్ హీరో
X

రామ్ చరణ్, అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అందుకే తన ఫ్రెండ్ కోసం సినిమా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. అఖిల్ హీరోగా తన బ్యానర్ పై ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుంది.

రామ్ చరణ్ కు ఆల్రెడీ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై ఇప్పటికే ఖైదీ నంబర్ 150 తీశాడు. ప్రస్తుతం సైరా అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత మిగతా హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తానని గతంలోనే ప్రకటించాడు చరణ్. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా అఖిల్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా తర్వాత ఆది పినిశెట్టి తమ్ముడు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయిన తర్వాత చెర్రీ నిర్మాతగా అఖిల్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

First Published:  25 Nov 2018 7:08 AM GMT
Next Story