Telugu Global
NEWS

సుజనా చౌదరి స్కామ్.... నిధులన్నీ టీడీపీ ఖర్చులకా?

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం…. అది కూడా షెల్ కంపెనీల ద్వారా. ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాలను చౌదరి ఫేక్ కంపెనీల ద్వారా లోన్లు తీసుకున్నాడని ఈడీ తేల్చింది. షెల్ కంపెనీలను క్రియేట్ చేసి…. వాటికి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. ఆ మొత్తాలతో వ్యాపారాలను చేస్తామని బ్యాంకులకు చెప్పారు. అయితే ఆ డబ్బును వేరే రూటుకు మళ్లించారు. వ్యాపారాలు చేసింది లేదు ఏమీ లేదు…. ఆ డబ్బును వేరే దారి పట్టించారు. తీరా […]

సుజనా చౌదరి స్కామ్.... నిధులన్నీ టీడీపీ ఖర్చులకా?
X

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం…. అది కూడా షెల్ కంపెనీల ద్వారా. ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాలను చౌదరి ఫేక్ కంపెనీల ద్వారా లోన్లు తీసుకున్నాడని ఈడీ తేల్చింది. షెల్ కంపెనీలను క్రియేట్ చేసి…. వాటికి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. ఆ మొత్తాలతో వ్యాపారాలను చేస్తామని బ్యాంకులకు చెప్పారు.

అయితే ఆ డబ్బును వేరే రూటుకు మళ్లించారు. వ్యాపారాలు చేసింది లేదు ఏమీ లేదు…. ఆ డబ్బును వేరే దారి పట్టించారు. తీరా బ్యాంకులు తిరిగి చెల్లించమని అడిగితే… వ్యాపారాలు చేశామని, భారీగా నష్టాలు వచ్చాయని కథలు అల్లారు. ఇదీ సుజనా చౌదరి స్కామ్.

ఈ వ్యవహారంపై బ్యాంకుల ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించింది. సుజనా చౌదరి క్రియేట్ చేసిన షెల్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లోని ఒక అడ్రస్ లోనే ఏకంగా నూటా ఇరవై ఆరు కంపెనీలను గుర్తించారట. అన్ని కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులను ఒకే చోట కనుగొన్నారట.

ఇదీ ఈ స్కామ్ లో కామెడీ. డొల్ల కంపెనీ అడ్రస్ లు సైతం ఒకే బిల్డింగ్ లో పెట్టినట్టుగా ఉన్నారు. ఆరు స్థలాల్లో సోదాలు చేస్తే ఏకంగా నూటా ఇరవై ఆరు కంపెనీలు బయటపడ్డాయని తెలుస్తోంది. మరి చౌదరి ఈ స్కామ్ డబ్బును ఏంచేశాడు అంటే.. తెలుగుదేశం పార్టీ వైపు వేళ్లు చూపుతుండటం విశేషం.

తెలుగుదేశం పార్టీకి అధికారం లేని తొమ్మిదేళ్లలో ఆ పార్టీ ఖర్చులకు, కార్యక్రమాలకు సుజనా చౌదరి డబ్బులు సర్ధాడనే మాట వినిపిస్తోంది.

నారాయణ, సీఎం రమేశ్, సుజనా చౌదరి…. ఆ తొమ్మిదేళ్లూ టీడీపీ ఖర్చులు భరించారని.. దానికి గానూ బాబు వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడని…. నారాయణ, సీఎం రమేశ్ ల సంగతలా ఉంటే.. సుజనా చౌదరి ఇలా బ్యాంకులకు టోపీ పెట్టి వేల కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి తెలుగుదేశం కార్యక్రమాలను నడిపించాడనే మాట వినిపిస్తోంది.

First Published:  25 Nov 2018 1:33 AM GMT
Next Story