Telugu Global
Cinema & Entertainment

టాక్సీవాలా ఫస్ట్ వీక్ వసూళ్లు

విడుదలకు ముందే పైరసీ అయినప్పటికీ టాక్సీవాలాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ దేవరకొండ క్రేజ్ ఒకటైతే, రెండోది థియేటర్లలో మరో సినిమా లేకపోవడం. అందుకే టాక్సీవాలాకు తిరుగులేకుండా పోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని, తద్వారా బ్రేక్-ఈవెన్ కూడా అయిందని నిర్మాత ఎస్-కే-ఎన్ ప్రకటించాడు. అంటే, టాక్సీవాలా విడుదలైన రెండో రోజు నుంచి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందన్నమాట. ఇక మొన్నటితో ఈ సినిమా సక్సెస్ ఫుల్ […]

టాక్సీవాలా ఫస్ట్ వీక్ వసూళ్లు
X

విడుదలకు ముందే పైరసీ అయినప్పటికీ టాక్సీవాలాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ దేవరకొండ క్రేజ్ ఒకటైతే, రెండోది థియేటర్లలో మరో సినిమా లేకపోవడం. అందుకే టాక్సీవాలాకు తిరుగులేకుండా పోయింది.

విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని, తద్వారా బ్రేక్-ఈవెన్ కూడా అయిందని నిర్మాత ఎస్-కే-ఎన్ ప్రకటించాడు. అంటే, టాక్సీవాలా విడుదలైన రెండో రోజు నుంచి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందన్నమాట.

ఇక మొన్నటితో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ (7 రోజులు) పూర్తిచేసుకొని రెండో వారంలోకి ఎంటరైంది. ఈ 7 రోజుల్లో టాక్సీవాలాకు వరల్డ్ వైడ్ 15 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో టాక్సీవాలా ఫస్ట్ వీక్ షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 5.40 కోట్లు
సీడెడ్ – రూ. 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.47 కోట్లు
ఈస్ట్ – రూ. 75 లక్షలు
వెస్ట్ – రూ. 66 లక్షలు
గుంటూరు – రూ. 89 లక్షలు
కృష్ణా – రూ. 88 లక్షలు
నెల్లూరు – రూ. 32 లక్షలు

First Published:  25 Nov 2018 2:17 AM GMT
Next Story