ఒక్కో ముద్దుకు 50 వేలట…. కానీ….

హాట్ బ్యూటీ హేబ్బా పటేల్ ఇటీవలే “24 కిస్సేస్” లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమా కోసం తెరవెనుక చాలా కిస్సులే పెట్టిందట ఈ భామ. పర్ఫెక్షన్ కోసం కిస్సులు ఎక్కువగా ఇచ్చింది అయితే వాటిలో కొన్ని మాత్రమే ఓకే అయ్యాయి. దాంతో ముద్దుల గోల అందునా లిప్ లాక్ లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కో ముద్దుకి యాభై వేల చొప్పున అని డిమాండ్ పెట్టిందట.

ఇంకేముంది రొమాంటిక్ మూవీ కాబట్టి పైసా వసూల్ అని భావించి లెక్క కట్టి 24 ముద్దులకు 12 లక్షలు ఇచ్చారట. అయితే హెబ్బా పటేల్ ముద్దుల గురించి సినిమాకు వచ్చిన ప్రేక్షకులు సినిమాలో అసలు ఏమీ లేదని గ్రహించి సినిమాని ఫ్లాప్ చేసి పడేసారు.

ఇంకేముంది హేబ్బా పటేల్ ముద్దులని క్యాష్ చేసుకోవాలి అనుకున్న నిర్మాతలు భారీగా నష్టపోయారు. కానీ హేబ్బా పటేల్ మాత్రం ఆ ముద్దుల వల్ల బాగానే లాభపడింది.