Telugu Global
Cinema & Entertainment

ట్రెండింగ్ లో 106 ఏళ్ల పెద్దావిడ

ఈమె పేరు రేలంగి సత్యవతి ఊరు – రాజమండ్రి వయసు – అక్షరాలా 106 సంవత్సరాలు ఈ పెద్దావిడ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం ఈ ఫొటో చూస్తేనే అర్థమైపోతుంది. అవును.. మహేష్ బాబు స్వయంగా వచ్చి ఈమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. అదే ఇక్కడ విశేషం. అందుకే ఈ ఫొటోలు, ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంతకీ మేటర్ ఏంటంటే.. మహేష్ ను కలవాలనేది ఈ వృద్ధురాలి చిరకాల […]

ట్రెండింగ్ లో 106 ఏళ్ల పెద్దావిడ
X

ఈమె పేరు రేలంగి సత్యవతి
ఊరు – రాజమండ్రి
వయసు – అక్షరాలా 106 సంవత్సరాలు

ఈ పెద్దావిడ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం ఈ ఫొటో చూస్తేనే అర్థమైపోతుంది. అవును.. మహేష్ బాబు స్వయంగా వచ్చి ఈమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. అదే ఇక్కడ విశేషం. అందుకే ఈ ఫొటోలు, ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి

ఇంతకీ మేటర్ ఏంటంటే.. మహేష్ ను కలవాలనేది ఈ వృద్ధురాలి చిరకాల కోరిక. ఈ విషయం ఆనోటా ఈనోటా ఫ్యాన్స్ ద్వారా మహేష్ చెవిన పడింది. తనకు ఇంత పెద్ద వయసున్న అభిమాని ఉందని తెలుసుకున్న మహేష్, వెంటనే ఆమెను కలిసేందుకు రెడీ అయ్యాడు.

తనే దగ్గరుండి తన మనుషుల్ని పంపించి, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు సత్యవతిని తీసుకొచ్చాడు. రామోజీ ఫిలింసిటీలో మహర్షి సినిమా సెట్స్ లో ఆమెను కలిశాడు మహేష్. సత్యవతికి దుస్తులతో పాటు కొన్ని బహుమతులు అందించాడు. తన చిరకాల కోరిక నెరవేరడంతో సత్యవతి ఉబ్బితబ్బిబ్బయింది.

First Published:  26 Nov 2018 6:24 AM GMT
Next Story