Telugu Global
NEWS

ఎన్నికల్లో ఓటుకు 10 వేలు.... ఐఏఎస్ అధికారి ఆరోపణ

తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువైంది. సరాసరిన ఓటుకు రూ.10వేల చొప్పున పంచుతున్నారు…. అని చెప్పింది ఏ సామన్యుడో కాదు…. ఓ ఐఏఎస్ అధికారి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇంత పనిచేసేది టీఆర్ఎస్ ఒక్కటేనని దుమ్మెత్తిపోస్తుంది. తెలంగాణ ఎన్నికల సరళిపై ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఆయన పురావస్తు శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మురళి చెప్పిన ప్రకారం.. ‘‘ తన బంధువు ఇంట్లో మూడు […]

ఎన్నికల్లో ఓటుకు 10 వేలు.... ఐఏఎస్ అధికారి ఆరోపణ
X

తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువైంది. సరాసరిన ఓటుకు రూ.10వేల చొప్పున పంచుతున్నారు…. అని చెప్పింది ఏ సామన్యుడో కాదు…. ఓ ఐఏఎస్ అధికారి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇంత పనిచేసేది టీఆర్ఎస్ ఒక్కటేనని దుమ్మెత్తిపోస్తుంది.

తెలంగాణ ఎన్నికల సరళిపై ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఆయన పురావస్తు శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మురళి చెప్పిన ప్రకారం.. ‘‘ తన బంధువు ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఓటు చొప్పున రూ.5 వేల చొప్పున రూ.15 వేలను ఇచ్చి వెళ్లారు. అంటే.. సగటున ఒక్కో ఓటుకు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.’’ అని అన్నారు.

కాగా, ఐఏఎస్ అధికారి మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. డబ్బులు పంపిణీ కార్యక్రమానికి, భారీగా నగదు ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ మాత్రమేనని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిఘా పెంచాలని, మురళి వ్యాఖ్యల ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహంపై నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు.

First Published:  26 Nov 2018 8:50 AM GMT
Next Story