Telugu Global
Cinema & Entertainment

బాహుబలిని క్రాస్ చేసిన 2.0

ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియేటర్లలో రిలీజైన ఇండియన్ సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి-2 మాత్రమే. వరల్డ్ వైడ్ 7వేలకు పైగా స్క్రీన్స్ పై ఒకేసారి ఈ సినిమా విడుదలైంది. ఇప్పటివరకు ఈ రికార్డును మరో సినిమా అధిగమించలేకపోయింది. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది. రజనీకాంత్ నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యథిక తెరలపై విడుదలవుతున్న ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించబోతోంది. విడుదలకు ఇంకా 48 గంటలు టైం ఉందనగా, ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10వేల 500 […]

బాహుబలిని క్రాస్ చేసిన 2.0
X

ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియేటర్లలో రిలీజైన ఇండియన్ సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి-2 మాత్రమే. వరల్డ్ వైడ్ 7వేలకు పైగా స్క్రీన్స్ పై ఒకేసారి ఈ సినిమా విడుదలైంది. ఇప్పటివరకు ఈ రికార్డును మరో సినిమా అధిగమించలేకపోయింది. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది.

రజనీకాంత్ నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యథిక తెరలపై విడుదలవుతున్న ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించబోతోంది.

విడుదలకు ఇంకా 48 గంటలు టైం ఉందనగా, ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10వేల 500 స్క్రీన్స్ లాక్ అయ్యాయి. మరో 24 గంటల్లో ఈ కౌంట్ మరో 300 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రికార్డు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు విడుదలలో కూడా తనదైన రికార్డు క్రియేట్ చేసింది.

2.0 వరల్డ్ వైడ్ స్క్రీన్ కౌంట్

అమెరికా – 850
యూకే – 300
యూరోప్ – 500
పశ్చిమాసియా – 350
దక్షిణాసియా – 100
ఇండియా – 7500
మధ్య ఆసియా – 900
మొత్తం – 10,500

First Published:  27 Nov 2018 10:37 AM GMT
Next Story