ఇండియాలో ఖరీదైన పాట ఇదే

భారీ బడ్జెట్ సినిమాలుంటాయి. భారీ గ్రాఫిక్స్ సినిమాలుంటాయి. భారీ యాక్షన్ తో కూడిన సినిమాలు కూడా ఉంటాయి. కానీ ఖరీదైన పాటలు కూడా ఉంటాయని నిరూపిస్తున్నాడు డైరక్టర్ శంకర్. 2.0 సినిమాలో కేవలం ఓ పాట కోసం నిర్మాతలతో ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టించాడు.

2.0 సినిమాలో రజనీకాంత్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా ”యంతర లోకపు సుందరివే” అనే పాట ఉంది. ఈ పాట కోసమే 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. కేవలం ఈ ఒక్క పాట కోసమే 4 భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ లో ఏకంగా 10 రోజుల పాటు షూట్ చేసి ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు.

అలా దేశంలోనే అత్యంత ఖరీదైన పాటగా రికార్డు సృష్టించింది ఈ సాంగ్. రెహ్మాన్ కంపోజ్ చేసిన ఈ పాటకు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.