చోటా  ముద్దు పై స్పందించిన కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని చోటా నాయుడు ఇటీవలే జరిగిన “కవచం” టిజర్ లాంచ్ ఈవెంట్ లో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సంఘటన జరిగేటప్పుడు అక్కడ ఉన్న వారు అందరు దీన్ని సరదాగానే తీసుకున్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం దీని పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే చోటా కే నాయుడు ని ఇండస్ట్రీ నుంచి పంపించేయాలి అన్నంత ఘాటుగా స్పందించారు అందరూ. ఈ సంఘటన జరిగిన తర్వాత కాజల్ తొలిసారిగా స్పందించింది.

చోటా కె నాయుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్. నా కెరీర్ ఆరంభం నుంచి అయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. “కవచం” టీజర్ లాంచ్ కార్యక్రమంలో అయన చేసింది నాకు తప్పుగా అనిపించలేదని చెప్పింది. ముద్దు వివాదం గురించి పదే పదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాజల్ తన అభిప్రాయాన్ని తెలియచేసింది.

ఇదిలా ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కాజల్ తో పాటు మేహ్రిన్ కూడా మరో హీరోయిన్ గా నటించింది.