అల్లు అరవింద్ ని పక్కన పెట్టేసిన…. చిరంజీవి, రామ్ చరణ్ !

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్… కొణిదెల ప్రొడక్షన్స్ మొదలుపెట్టక ముందు వరకు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ని ఇచ్చారు.

అయితే కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించాక మాత్రం రామ్ చరణ్ పూర్తిగా గీతా ఆర్ట్స్ ని పక్కన పెట్టాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో “సై రా” సినిమా, ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు హీరో గా నటించబోతున్న సినిమాలు రూపొందుతున్నాయి.

అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను చిరంజీవితో సినిమా చెయ్యాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించాలని అల్లు అరవింద్ కూడా ఎదురు చూస్తున్నాడని సమాచారం.

కానీ రామ్ చరణ్ మాత్రం గీతా ఆర్ట్స్ ని పక్కనపెట్టి…. కొణిదెల ప్రొడక్షన్స్ పైనే సినిమాని నిర్మించాలని భావిస్తున్నాడట. దీన్ని బట్టి చూస్తుంటే ఇక మెగా ఫ్యామిలీ వారు అల్లు ఫ్యామిలీ కి సంబంధించిన గీతా ఆర్ట్స్ లో సినిమాలు చెయ్యరేమోననిపిస్తోంది.