Telugu Global
National

తన కుల, గోత్రాల్ని ప్రకటించిన రాహుల్‌

ఇటీవల వరుసగా ఆలయాల చుట్టూ తిరుగుతున్న రాహుల్‌ మరో అడుగు ముందుకేశారు. తన తల్లి సోనియా క్రిస్టియన్‌ కావడంతో ఒక వర్గం నుంచి రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో గుళ్లకు వెళ్లడం, శివపూజలు చేయడం వంటివి చేస్తున్నారు రాహుల్. తాజాగా రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పుష్కర్‌లోని ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుల్‌ గోత్రాన్ని అడిగారు. అందుకు రాహుల్‌…. తాను కౌల్‌ బ్రాహ్మణుడినని వెల్లడించారు. తన గోత్రం దత్తాత్రేయ గోత్రమని […]

తన కుల, గోత్రాల్ని ప్రకటించిన రాహుల్‌
X

ఇటీవల వరుసగా ఆలయాల చుట్టూ తిరుగుతున్న రాహుల్‌ మరో అడుగు ముందుకేశారు. తన తల్లి సోనియా క్రిస్టియన్‌ కావడంతో ఒక వర్గం నుంచి రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో గుళ్లకు వెళ్లడం, శివపూజలు చేయడం వంటివి చేస్తున్నారు రాహుల్.

తాజాగా రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పుష్కర్‌లోని ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుల్‌ గోత్రాన్ని అడిగారు. అందుకు రాహుల్‌…. తాను కౌల్‌ బ్రాహ్మణుడినని వెల్లడించారు. తన గోత్రం దత్తాత్రేయ గోత్రమని వివరించారు.

ఆ గోత్రంతో పూజలు చేయించారు. ఇటీవల టెంపుల్ రన్ చేస్తున్న రాహుల్‌ను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు. అసలు రాహుల్‌ గోత్రమేంటని కూడా కొందరు ప్రశ్నించారు. దీంతో రాహుల్‌ తన కులగోత్రాలు వెల్లడించారు.

First Published:  27 Nov 2018 6:54 AM GMT
Next Story