Telugu Global
NEWS

చంద్రబాబు వెన్నుపోటే పెద్ద సస్పెన్స్

ప్రస్తుతం భైరవగీత సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నల కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైనే మీడియా అతడిని ఎక్కువగా ప్రశ్నిస్తోంది. దీనితో వర్మకు కూడా ఈ సినిమాపై స్పందించక తప్పడం లేదు. ఇందులో భాగంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర గురించి, అతడి వెన్నుపోటు గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం ఏకంగా నలుగుర్ని ఎంపిక […]

చంద్రబాబు వెన్నుపోటే పెద్ద సస్పెన్స్
X

ప్రస్తుతం భైరవగీత సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నల కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైనే మీడియా అతడిని ఎక్కువగా ప్రశ్నిస్తోంది. దీనితో వర్మకు కూడా ఈ సినిమాపై స్పందించక తప్పడం లేదు. ఇందులో భాగంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర గురించి, అతడి వెన్నుపోటు గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు వర్మ.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం ఏకంగా నలుగుర్ని ఎంపిక చేశాడట వర్మ. ఆడిషన్ తర్వాత వీళ్లలో ఒకర్ని ఎంపిక చేశాడట. ప్రస్తుతం అలా ఎంపిక చేసిన చంద్రబాబు పాత్రధారిపై షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. అప్పట్లో చంద్రబాబు పాత్రధారికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తిని మాత్రం తన సినిమాలో తీసుకోలేదంటున్నాడు.

ఇక వెన్నుపోటు గురించి మీడియా ఎంత ప్రశ్నించినా వర్మ స్పందించలేదు. అది చెప్పేస్తే, సినిమాలో కిక్ పోతుందని అంటున్నాడు. నిజానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్ అదేనంటున్నాడు. అయితే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వెన్నుపోటు ఉదంతాన్ని యథాతథంగా మాత్రం చూపిస్తానంటున్నాడు వర్మ.

First Published:  26 Nov 2018 11:13 PM GMT
Next Story