సాహో సెట్స్ లో ఫుడ్ ఫెస్టివల్

ఓ గమ్మత్తైన ఫొటో షేర్ చేసింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. టేబుల్ పై దాదాపు ఓ 15 వెరైటీలు పెట్టుకొని ఓ ఫొటోకు పోజిచ్చింది ఈ ముద్దుగుమ్మ. సాహో సెట్స్ లో తను కోరుకున్నప్పుడల్లా ఫుడ్ ఫెస్టివల్ గ్యారెంటీ అంటోంది. అవును.. అన్ని రకాల ఆంధ్రా వంటకాల్ని రుచిచూస్తోంది శ్రద్ధాకపూర్. దీనికి కారణం ప్రభాస్.

తనకు ఎవరు పరిచయమైనా, వాళ్లను ఆంధ్రా వంటకాలతో ముంచెత్తడం ప్రభాస్ స్టయిల్. శ్రద్ధాకపూర్ కు కూడా ఇలానే అంధ్రా వంటకాల్ని, భీమవరం రుచుల్ని పరిచయం చేశాడు ఈ హీరో. తన ఇంట్లో స్వయంగా చేయించి మరీ శ్రద్ధా కోసం తెప్పించేవాడు. అలా ఇప్పటికే పలుమార్లు సౌత్ వంటకాల్ని టేస్ట్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరోసారి అలాంటి ఫుడ్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేసింది.

ప్రస్తుతం సాహో సెట్స్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈమెపై కొన్ని కాంబినేషన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఆ షూటింగ్ గ్యాప్ లోనే ఇలా తనకోసం వచ్చిన వివిధ రకాల వంటకాలతో ఫొటో దిగింది శ్రద్ధ.