చెక్కుచెదరని కవచం… రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంకా కొన్ని క్యారెక్టర్లకు డబ్బింగ్ అవ్వలేదన్నారు. ఓ సాంగ్ షూటింగ్ కూడా పెండింగ్ ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న వస్తుందనుకున్న కవచం సినిమా మరో తేదీకి వాయిదా పడుతుందంటూ రూమర్లు వచ్చాయి. దీంతో యూనిట్ మరోసారి అప్రమత్తమైంది. మరోసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించింది.

గతంలో చెప్పినట్టుగానే డిసెంబర్ 7వ తేదీన కవచం సినిమా థియేటర్లలోకి వచ్చి తీరుతుందంటున్నాడు నిర్మాత నవీన్. పుకార్లు నమ్మొద్దని, సినిమా చాలా బాగా వచ్చిందని చెబుతున్నాడు. మరో 2 రోజుల్లో సెన్సార్ కూడా కంప్లీట్ చేస్తామని ప్రకటించిన నిర్మాత.. కవచం సినిమా హీరో బెల్లంకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు.

కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. సాక్ష్యం లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న కవచంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. రీసెంట్ గా ఇతడి మార్కెట్ తగ్గడంతో, ఈ సినిమాను ఉన్నంతలో తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించినట్టు టాక్.