Telugu Global
Others

ఎవరూ దొరక్క మళ్ళీ ఆ భామనే ఫిక్స్ అయిన బోయపాటి శ్రీను

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటీవలే టిజర్ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర స్తుతం ఈ సినిమాకి సంబంధించిన టాకీ మొత్తం పూర్తయ్యింది. ఒక్క ఐటెం సాంగ్ షూట్ చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కానీ ఐటెం సాంగ్ లో డాన్స్ చెయ్యడానికి ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ కూడా దొరకలేదు. ఈ ఐటెం సాంగ్ లో […]

ఎవరూ దొరక్క మళ్ళీ ఆ భామనే ఫిక్స్ అయిన బోయపాటి శ్రీను
X

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటీవలే టిజర్ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర

స్తుతం ఈ సినిమాకి సంబంధించిన టాకీ మొత్తం పూర్తయ్యింది. ఒక్క ఐటెం సాంగ్ షూట్ చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కానీ ఐటెం సాంగ్ లో డాన్స్ చెయ్యడానికి ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ కూడా దొరకలేదు. ఈ ఐటెం సాంగ్ లో చరణ్ పక్కన డాన్స్ చెయ్యడానికి బోయపాటి శ్రీను స్టార్ హీరోయిన్ ని ట్రై చేసున్నాడట. కానీ ఎవరి డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్ల బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ని కూడా ట్రై చేశాడట. తను ప్రస్తుతం “సాహో” సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

ఇక బోయపాటి చేసేది లేక మళ్ళీ తన పాత హీరోయిన్ అయిన క్యాథరిన్ నే ఈ ఐటెం సాంగ్ కోసం పెట్టబోతున్నాడట. క్యాథరిన్ ఇది వరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” సినిమా లో ఐటెం సాంగ్ చేసింది. అలాగే “సరైనోడు” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

అందుకే ఇక ఎవ్వరు దొరకక బోయపాటి మళ్ళీ క్యాథరిన్ తోనే ఈ ఐటెం సాంగ్ ని తెరకేక్కించాలి అని భావిస్తున్నాడట.

First Published:  28 Nov 2018 12:25 AM GMT
Next Story