Telugu Global
Cinema & Entertainment

టాక్సీవాలాను ప్రత్యేకంగా మెచ్చుకున్న మెగాస్టార్

ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్ అయితే, ఆ యూనిట్ లోని కీలకమైన సభ్యుల్ని తన ఇంటికి పిలిపించుకొని మరీ శాలువాలు కప్పే కొత్త సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు చిరు. దాసరి కన్నుమూత తర్వాత ఇండస్ట్రీ పెద్దమనిషి అవతారం ఎత్తిన చిరంజీవి, ఇప్పటికే ఎన్నో చిన్న-పెద్ద సినిమాల విజయాల్ని తన విజయంగా పండగ చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి టాక్సీవాలా సినిమా కూడా చేరింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ యానిట్ […]

టాక్సీవాలాను ప్రత్యేకంగా మెచ్చుకున్న మెగాస్టార్
X

ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్ అయితే, ఆ యూనిట్ లోని కీలకమైన సభ్యుల్ని తన ఇంటికి పిలిపించుకొని మరీ శాలువాలు కప్పే కొత్త సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు చిరు. దాసరి కన్నుమూత తర్వాత ఇండస్ట్రీ పెద్దమనిషి అవతారం ఎత్తిన చిరంజీవి, ఇప్పటికే ఎన్నో చిన్న-పెద్ద సినిమాల విజయాల్ని తన విజయంగా పండగ చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి టాక్సీవాలా సినిమా కూడా చేరింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ యానిట్ లో సభ్యుల్ని చిరంజీవి తన ఇంటికి అహ్వానించారు. శాలువాలు కప్పకపోయినా షేక్ హ్యండ్ ఇచ్చి అందర్నీ అభినందించారు. ఇకపై కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని సూచించారు. ఈ సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్ కు కూడా భాగస్వామ్యం ఉండడంతో.. చిరంజీవితో భేటీ యూనిట్ కు చాలా ఈజీ అయిపోయింది.

అయితే టాక్సీవాలో యూనిట్ లో కీలక సభ్యుడు విజయ్ దేవరకొండ మాత్రం చిరంజీని కలవలేకపోయాడు. ఆయన ఎందుకు చిరంజీవిని కలవలేదనే విషయంపై నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం టాక్సీవాలా సినిమా 20 కోట్ల రూపాయల వసూళ్లతో థియేటర్లలో స్టడీగా కొనసాగుతోంది.

First Published:  28 Nov 2018 9:54 AM GMT
Next Story