Telugu Global
NEWS

సైన్స్‌కే అంతుచిక్కని చంద్రబాబు.... కొండలు లేని చోట 125 టీఎంసీల ప్రాజెక్టు కడతాడట!

కరువుతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలు అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పట్టిసీమతో కరువును తరిమేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. కృష్ణా డెల్టాకు కూడా నీరు ఇవ్వలేని చంద్రబాబు…. రాయలసీమలో కరువు తరిమాననడం విచిత్రంగా ఉందన్నారు. గోదావరి-పెన్నా లింకేజ్‌ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని… కేవలం మొబలైజేషన్ అడ్వాన్స్‌ లు దోచుకునేందుకే నదుల అనుసంధానం అంటున్నారని విమర్శించారు. రాయలసీమ కోసమే గోదావరి-పెన్నా అనుసంధానం అంటున్న చంద్రబాబు.. కనీసం ఈ ప్రాంత టీడీపీ నేతలు, మంత్రులతోనైనా చర్చించారా […]

సైన్స్‌కే అంతుచిక్కని చంద్రబాబు.... కొండలు లేని చోట 125 టీఎంసీల ప్రాజెక్టు కడతాడట!
X

కరువుతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలు అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పట్టిసీమతో కరువును తరిమేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

కృష్ణా డెల్టాకు కూడా నీరు ఇవ్వలేని చంద్రబాబు…. రాయలసీమలో కరువు తరిమాననడం విచిత్రంగా ఉందన్నారు. గోదావరి-పెన్నా లింకేజ్‌ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని… కేవలం మొబలైజేషన్ అడ్వాన్స్‌ లు దోచుకునేందుకే నదుల అనుసంధానం అంటున్నారని విమర్శించారు.

రాయలసీమ కోసమే గోదావరి-పెన్నా అనుసంధానం అంటున్న చంద్రబాబు.. కనీసం ఈ ప్రాంత టీడీపీ నేతలు, మంత్రులతోనైనా చర్చించారా అని నిలదీశారు.

ఎందుకు రాయలసీమ అంటే అంత ద్వేషం అని ప్రశ్నించారు. కేవలం దోచుకోవడానికే రాయలసీమ పేరును చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు.

17వేల కోట్లతో అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాది అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారని… నిన్న దేవినేని ఉమా మాత్రం ఇప్పటికే 65వేల కోట్లను పెండింగ్‌ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టామని చెబుతున్నారని… అంటే 48వేల కోట్లు దోచుకున్నది నిజం అని స్పష్టమవుతోందన్నారు.

ఇలా దోపిడి చేశారు కాబట్టే సీబీఐని రానివ్వమంటున్నారని విమర్శించారు. మొత్తం అన్ని శాఖల్లో రెండు లక్షల కోట్లను ఏపీలోని పది, పదిహేను కుటుంబాలు దోచుకున్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు చెబుతున్న మాటలు సైన్సేకే అంతుపట్టడం లేదన్నారు. భారీ ప్రాజెక్టులను ఎక్కడైనా రెండు కొండల మధ్య కడతారన్నారు. అవకాశం ఉంది కాబట్టి పులిచింతల ప్రాజెక్టును 40 టీఎంసీల కోసం కట్టారని… జూరాల వద్ద అవకాశం లేదు కాబట్టి 11 టీఎంసీలకే కట్టారన్నారు .

చంద్రబాబు మాత్రం గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా గుంటూరుకు ఎగువన 125 టీఎంసీలతో కొండలు లేని చోట భారీ ప్రాజెక్టు కడతానని చెబుతున్నారని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

గోదావరి- పెన్నా అనుసంధానం ద్వారా మే మాసంలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని… అసలు మే నెలలో గోదావరిలో ప్రవాహం ఉంటుందా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పదవి కోసం ఇంత దిగజారిపోయి ఇన్ని అబద్దాలు చెప్పాల్సిన స్థాయికి ఎందుకు దిగజారారని చంద్రబాబును ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏమీ చేయలేని చంద్రబాబు… కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారని ఎద్దేవా చేశారు. గతంలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకున్నచంద్రబాబు… ఇప్పుడు కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు.

అనునిత్యం భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వ్యక్తి చంద్రబాబేనన్నారు. జగన్ ప్రతికూల పరిస్థితుల్లో సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూడా పోరాటం చేశారని చెప్పారు.

చంద్రబాబు రెయిన్‌గన్‌లు పెట్టిన చోట పంటే లేకుండాపోయిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వర్షభావంతో రాయలసీమ ప్రజలు అల్లాడిపోతున్నారని.. వారిపై కనీసం కనికరం చూపాలని చంద్రబాబుకు సూచించారు శ్రీకాంత్ రెడ్డి.

First Published:  28 Nov 2018 2:14 AM GMT
Next Story