ప్రపంచహాకీ ప్రారంభవేడుకలు అదుర్స్

  • ప్రత్యేక ఆకర్షణగా మాథురీ దీక్షిత్, షారుక్ ఖాన్, రెహ్మాన్
  • రెహ్మాన్ సంగీతానికి…మాధురీ నృత్యాలు
  • రంగుల హరివిల్లులా మారిన కళింగ స్టేడియం

14వ ప్రపంచకప్ హాకీ పోటీలు…భారత గడ్డ భువనేశ్వర్ కళింగ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత మాంత్రికుడు రెహ్మాన్ , షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ప్రారంభవేడుకల అనంతరం….ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్…లాంఛనంగా పోటీలను ప్రారంభించారు.

నుపుర్ మహాజన్ రచన, దర్శకత్వంలో సాగిన భూమాత గీతాన్ని…మాధురీ దీక్షిత్ తన అపూర్వ నృత్యరీతులతో ప్రదర్శించడం ద్వారా…అభిమానులను సంమోహితులను చేశారు. మొత్తం 1100 మంది కళాకారులతో ఈ గీతాన్ని ప్రదర్శించడం విశేషం.

ఈటోర్నీలో తలపడుతున్న మొత్తం 16 జట్ల కెప్టెన్లు సైతం ప్రారంభవేడుకల్లో పాల్గొన్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకూ జరిగే ఈటోర్నీ కోసం హాకీ ఇండియా విస్త్రృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఒరిస్సా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ నిర్వహణ కోసం….16వేల సీటింగ్ కెపాసిటీతో…కళింగ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని సిద్ధం చేశారు.

ఏడున్నర దశాబ్దాల ప్రపంచ కప్ హాకీ చరిత్రలోనే… ఈటోర్నీ ప్రారంభవేడుకలను అపూర్వంగా నిర్వహించిన ఘనతను భారత హాకీ సమాఖ్య దక్కించుకొంది.