అనసూయకి గట్టి పోటీ ఇస్తున్న మరో యాంకర్?

ఇప్పుడు బుల్లి తెర ప్రొగ్రామ్స్ లో జబర్దస్త్ హవానే నడుస్తోంది. గత అయిదేళ్లుగా ఈ షో తెలుగు టీవి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది.

ఈ షో యాంకర్ అనసూయకి ఫుల్ క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా అనసూయ జబర్దస్త్ షో లో కనిపించడం లేదు. కొన్ని రోజులు ఈ షోకి దూర‌మైంది అన‌సూయ‌. ఆమె స్థానంలో వ‌ర్షిణిని తీసుకొచ్చింది మ‌ల్లెమాల టీమ్‌. అన‌సూయ‌ని చూసిన క‌ళ్ల‌తో వ‌ర్షిణిని ఏం చూస్తాంలే అనుకుంటే వ‌ర్షిణి త‌న మాటలతో అద‌ర‌గొట్ట‌డం మొద‌లెట్టింది. షో.. షోకి త‌న ఈజ్ పెంచుకుంటూ పోయింది. దాంతో వ‌ర్షిణికి మంచి మార్కులు పడుతున్నాయట.

ఇప్పుడు అనసూయ కంటే ఈ షో కి వర్షిణి ఉంటేనే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వ‌చ్చేసిందట జబర్దస్త్ టీమ్‌. అయితే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోడానికి మరో కారణం కూడా ఉందట. అన‌సూయ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటోంది. ఆమె పారితోషికం కూడా ఎక్కువే.

ఇలాంటి సమయంలో అనసూయ కంటే కూడా వర్షిణి అయితేనే ఈ షో కి బెస్ట్ అని టీం భావిస్తోందట. మొత్తానికి డేట్స్ సర్దుబాటు చెయ్యడం కోసం కొంత బ్రేక్ తీసుకున్న అనసూయ కి వర్షిణి గట్టి పోటీగా మారిందంటున్నారు.