హీరోను మార్చారు…. డబ్బులివ్వను?

మెగా చిరంజీవి చినల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇటీవలే ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పులి వాసు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అయితే మొదట ఈ సినిమా కోసం హీరోయిన్ గా ప్రియ వారియర్ ని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదు అని తెలపడంతో… మెహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. అందుకోసం మెహ్రీన్ కి 30 ల‌క్ష‌ల పారితోషికానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. రూ.10 ల‌క్ష‌ల అడ్వాన్సు కూడా ఇచ్చారట.

ఇప్పుడు మెహ్రీన్ ఈ సినిమా చేయ‌నంటోంద‌ట‌. ఆ అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వ‌న‌ని చెబుతోంద‌ట‌. ముందు ఓ హీరోని అనుకున్నార‌ని, ఆ త‌ర‌వాత హీరోని మార్చార‌ని అందుకే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని మెహ్రీన్ చెబుతోంది.

అయితే ఈ సినిమాకి మొదట సుధీర్ బాబు హీరోగా ఉన్నాడు. కానీ మధ్యలో నిర్మాతకి, సుధీర్ కి గొడవ రావడంతో హీరోగా కళ్యాణ్ దేవ్ ని పెట్టుకున్నారు. అందుకే అడ్వాన్సు ఇవ్వ‌నంటోందట ఈ భామ.

నిర్మాత మాత్రం హీరో ఎవ‌రైనా స‌రే…. మెహ్రీన్ ఈ సినిమా చేయాల్సిందేన‌ని…. కావాలంటే పారితోషికం ఇంకొంత పెంచుతామ‌ని అంతే గాని సినిమా చెయ్యను అంటే అస్సలు కుదరదు అంటున్నారు. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.