టీడీపీ ఎమ్మెల్సీ vs టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య గొడవ నడుస్తోంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తనపట్ల వ్యవహరించిన తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కమిషనర్‌ అనుమతితో ఫ్లెక్సీ పెట్టినా… ఎమ్మెల్యే నిమ్మల ఆదేశాలతోనే తొలగించారని ఆరోపించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

36 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నానని చెప్పారు. తన విషయంలో అధికారులు సరిగా స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్యే నిమ్మల గెలుపు కోసం తాను పనిచేస్తే… ఆయన మాత్రం తిరిగి తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫ్లెక్సీ వివాదం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు.