Telugu Global
Cinema & Entertainment

అఖిల్-చరణ్-బోయపాటి.... ఇది ఫిక్స్?

తన వద్దకు ఓ దర్శకుడు వస్తే వెంటనే అతడ్ని లాక్ చేయడం రామ్ చరణ్ స్టయిల్. ధృవ సినిమా కోసం సురేందర్ రెడ్డి వస్తే, అతడికి సైరా ప్రాజెక్టు అప్పగించాడు. రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ కు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ”వినయ విధేయ రామ” సినిమా చేస్తున్న బోయపాటిని కూడా లాక్ చేశాడట చెర్రీ. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోయపాటితో ఓ సినిమా నిర్మించేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టులో చరణ్ […]

అఖిల్-చరణ్-బోయపాటి.... ఇది ఫిక్స్?
X

తన వద్దకు ఓ దర్శకుడు వస్తే వెంటనే అతడ్ని లాక్ చేయడం రామ్ చరణ్ స్టయిల్. ధృవ సినిమా కోసం సురేందర్ రెడ్డి వస్తే, అతడికి సైరా ప్రాజెక్టు అప్పగించాడు. రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ కు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ”వినయ విధేయ రామ” సినిమా చేస్తున్న బోయపాటిని కూడా లాక్ చేశాడట చెర్రీ.

కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోయపాటితో ఓ సినిమా నిర్మించేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టులో చరణ్ నిర్మాత పాత్ర మాత్రమే పోషిస్తాడు. హీరోగా అఖిల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నిజానికి అఖిల్-బోయపాటి కాంబోలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై ఓ సినిమా రావాల్సి ఉంది. ఇప్పుడా సినిమానే కొణెదల ప్రొడక్షన్స్ వైపు మళ్లించినట్టు తెలుస్తోంది.

అఖిల్, బోయపాటి డైరక్షన్ లో సినిమా చేస్తే చాలు. బ్యానర్ ఎవరిదైనా నాగార్జునకు ఓకే. అందుకే పెద్దగా కొర్రీలు పెట్టకుండా కాంట్రాక్ట్ ను చరణ్ కు ట్రాన్స్ ఫర్ చేశాడట నాగార్జున. ”వినయ విధేయ రామ” సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే అఖిల్-బోయపాటి-చరణ్ సినిమాపై క్లారిటీ వస్తుంది.

First Published:  27 Nov 2018 10:51 PM GMT
Next Story