Telugu Global
Cinema & Entertainment

చెర్రీతో క్యాథరిన్ ఐటం సాంగ్

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటివలే టిజర్ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన టాకీ మొత్తం పూర్తయ్యింది, ఒక్క ఐటెం సాంగ్ షూట్ చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కానీ ఐటెం సాంగ్ లో డాన్స్ చెయ్యడానికి ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ కూడా దొరకలేదు. ఈ ఐటెం సాంగ్ లో చరణ్ […]

చెర్రీతో క్యాథరిన్ ఐటం సాంగ్
X

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. ఇటివలే టిజర్ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన టాకీ మొత్తం పూర్తయ్యింది, ఒక్క ఐటెం సాంగ్ షూట్ చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కానీ ఐటెం సాంగ్ లో డాన్స్ చెయ్యడానికి ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ కూడా దొరకలేదు.

ఈ ఐటెం సాంగ్ లో చరణ్ పక్కన డాన్స్ చెయ్యడానికి బోయపాటి శ్రీను స్టార్ హీరోయిన్ ని ట్రై చేసాడు, కానీ ఎవరి డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్ల బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ని కూడా ట్రై చేసాడు. తను ప్రస్తుతం “సాహో” సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఇక బోయపాటి చేసేది లేక మళ్ళి తన పాత హీరోయిన్ అయిన క్యాథరిన్ నే ఈ ఐటెం సాంగ్ కోసం పెట్టబోతున్నాడు అంట. క్యాథరిన్ ఇది వరకు బోయప్తి శ్రీను దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” సినిమా లో ఐటెం సాంగ్ చేసింది, అలాగే “సరైనోడు” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అందుకే ఇక ఎవ్వరు దొరకరు అని గ్రహించిన బోయపాటి మళ్ళి క్యాథరిన్ తోనే ఈ ఐటెం సాంగ్ ని తెరకేక్కించాలి అని భావిస్తున్నాడు అంట.

First Published:  27 Nov 2018 11:01 PM GMT
Next Story