Telugu Global
Cinema & Entertainment

కొడుకుల ఎంట్రీపై శ్రీకాంత్ ఏమంటున్నాడో తెలుసా?

శ్రీకాంత్ పెద్దకొడుకు ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు. చిన్న కొడుకు కూడా  ఓ సినిమాలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వాళ్ల భవిష్యత్ ప్రణాళికలేంటో విడమర్చి చెప్పాడు హీరో శ్రీకాంత్. “చిన్నబ్బాయ్ రోహన్ ప్రభుదేవా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ హిందీ భాషల్లో వస్తుంది. ఈ సినిమాలో ప్రభుదేవా కొడుకుగా నటిస్తున్నాడు రోహన్. రోషన్ ని 2019 లో గ్రాండ్ గా లాంచ్ చేద్దామనుకుంటున్నాం. ఎలా ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి.” ఇలా ఇద్దరు కొడుకుల […]

కొడుకుల ఎంట్రీపై శ్రీకాంత్ ఏమంటున్నాడో తెలుసా?
X
శ్రీకాంత్ పెద్దకొడుకు ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు. చిన్న కొడుకు కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వాళ్ల భవిష్యత్ ప్రణాళికలేంటో విడమర్చి చెప్పాడు హీరో శ్రీకాంత్.
“చిన్నబ్బాయ్ రోహన్ ప్రభుదేవా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ హిందీ భాషల్లో వస్తుంది. ఈ సినిమాలో ప్రభుదేవా కొడుకుగా నటిస్తున్నాడు రోహన్. రోషన్ ని 2019 లో గ్రాండ్ గా లాంచ్ చేద్దామనుకుంటున్నాం. ఎలా ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి.”
ఇలా ఇద్దరు కొడుకుల సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు శ్రీకాంత్. రోషన్ మొదటి సినిమాలో అతడు హీరో కాదని, కేవలం ఓ మంచి క్యారెక్టర్ మాత్రమే పోషించాడని.. హీరోగా అతడి ఎంట్రీ మూవీ త్వరలోనే ఉంటుందని అంటున్నాడు శ్రీకాంత్. నిర్మలా కాన్వెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ ఇలా కవరింగ్ ఇస్తున్నాడు. ఇక డిసెంబర్ 1న విడుదలకానున్న తన అప్ కమింగ్ మూవీ ఆపరేషన్ 2019పై కూడా రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.
“ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు, ఫారిన్ కి వెళ్ళి వచ్చి, తన సమస్యను పొలిటీషియన్స్ దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు..? అనేది సినిమాకి మెయిన్ టర్నింగ్ పాయింట్. అప్పుడు వాళ్ళపై కోపంతో పాలిటిక్స్ లోకి వచ్చిన ఆ యువకుడు, ఏం తెలుసుకున్నాడు..? నిజంగా ప్రజాస్వామ్యంలో తప్పు కేవలం పొలిటీషియన్సే చేస్తున్నారా..? ఆ తప్పుల్లో ప్రజల పర్సంటేజ్ ఎంత ఉందనేదే ఈ సినిమా.”
తన కొత్త సినిమా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని అంటున్నాడు శ్రీకాంత్. ప్రస్తుత రాజకీయాల్ని ప్రతిబింబించే విధంగా తన సినిమా ఉంటుందని, ఈ ఎన్నికల సీజన్ లో తన సినిమాకు మంచి మైలేజీ వస్తుందని ఆశపడుతున్నాడు.
First Published:  28 Nov 2018 7:40 AM GMT
Next Story