Telugu Global
NEWS

మిథాలీ ఓ బ్లాక్ మెయిలర్ " కోచ్ రమేశ్ పొవార్

మిథాలీ ప్రవర్తన పై బీసీసీఐకి 5 పేజీల నివేదిక పొవార్ ఆరోపణలు దారుణం – మిథాలీ రాజ్ 20 ఏళ్ల కెరియర్ లో ఇదే చీకటి దినం భారత మహిళా క్రికెట్లో విమర్శల యుద్ధం ముదిరిపాకానపడింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్, టీమ్ కోచ్ రమేశ్ పొవార్ ల ప్రశ్చన్న యుద్ధం కాస్త…. ప్రత్యక్ష యుద్ధంగా మారింది. మిథాలీని బ్లాక్ మెయిలర్ అంటూ రమేశ్ పొవార్ తప్పుపడితే…. పొవార్ విమర్శలు దారుణమంటూ మిథాలీ లబోదిబో అంటోంది. కరీబియన్ […]

మిథాలీ ఓ బ్లాక్ మెయిలర్  కోచ్ రమేశ్ పొవార్
X
  • మిథాలీ ప్రవర్తన పై బీసీసీఐకి 5 పేజీల నివేదిక
  • పొవార్ ఆరోపణలు దారుణం – మిథాలీ రాజ్
  • 20 ఏళ్ల కెరియర్ లో ఇదే చీకటి దినం

భారత మహిళా క్రికెట్లో విమర్శల యుద్ధం ముదిరిపాకానపడింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్, టీమ్ కోచ్ రమేశ్ పొవార్ ల ప్రశ్చన్న యుద్ధం కాస్త…. ప్రత్యక్ష యుద్ధంగా మారింది.

మిథాలీని బ్లాక్ మెయిలర్ అంటూ రమేశ్ పొవార్ తప్పుపడితే…. పొవార్ విమర్శలు దారుణమంటూ మిథాలీ లబోదిబో అంటోంది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత జట్టు ఓటమి పాలయ్యిందో …లేదో…టీమ్ మేనేజ్ మెంట్ కు… మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కు మధ్య ఆరోపణలు, విమర్శల యుద్ధం పతాక స్థాయికి చేరింది.

ప్రపంచకప్ సెమీ ఫైనల్లో పాల్గొన్న భారత తుది జట్టు నుంచి తనను తప్పించడం పై… మిథాలీ ముందుగా…. తన వ్యక్తిగత కార్యదర్శితో సమరానికి తెరలేపింది. టీ-20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్ లపై మిథాలీ తన కార్యదర్శి ద్వారా యుద్ధం ప్రకటించింది.

అంతేకాదు…కరీబియన్ ద్వీపాల నుంచి ముంబై చేరుకొన్న వెంటనే…. బీసీసీఐ పాలక మండలి సభ్యురాలు డయానా ఎడుల్జీతో పాటు… టీమ్ కోచ్ రమేశ్ పొవార్ పైనా…. మిథాలీ ఫిర్యాదు చేసింది.

పాలకమండలి సభ్యురాలు డయానాతో పాటు… కోచ్ రమేశ్ పొవార్ తనపైన కక్ష కట్టారని… తన కెరియర్ అంతం చేయటానికి కుట్రపన్నారంటూ …తన ఇ-మెయిల్ లో మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది.

క్రికెట్ కోసం 20 ఏళ్లపాటు తన జీవితాన్ని అంకితం చేసానని…చివరకు అవమానం మిగిలిందంటూ మిథాలీ ఆందోళన వెలిబుచ్చింది.

కోచ్ రమేశ్ పొవార్ తనను ఓ మనిషిలా చూడలేదని…తనను చూసి తలతిప్పుకొనేవారని…గ్రౌండ్లో తన మొఖం చూడటానికి ఇష్టపడేవారు కాదంటూ మిథాలీ వాపోయింది.

మిథాలీ ఇ-మెయిల్ లీక్….

బీసీసీకి మిథాలీ పంపిన ఇ-మెయిల్ మీడియాకు లీక్ కావడంతో…. మహిళా క్రికెట్ కోచ్ రమేశ్ పొవార్…. తన వాదన వినిపించారు. మిథాలీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మిథాలీకి జట్టు ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని… ఓపెనర్ గా మాత్రమే బ్యాటింగ్ కు దిగుతానని… లేదంటే కిట్ బ్యాగ్ సర్దుకొని స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానంటూ…. బెదిరించేదని…. కోచ్ లను బ్లాక్ మెయిల్ చేయటం మిథాలీకి ఆదినుంచి అలవాటేనని…. తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యక్తిగత రికార్డుల కోసం ఆడటమే మిథాలీకి ఓ అలవాటుగా వస్తోందని.. పైగా.. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మిథాలీ స్ట్రయిక్ రేట్ చాలా తక్కువగా ఉందని రమేశ్ పొవార్ వివరించారు.

బీసీసీఐకి రమేశ్ పొవార్ సమర్పించిన 10 పేజీల నివేదికలో… మిథాలీ ప్రవర్తన పైనే ఐదుపేజీల వివరణ ఉండటం విశేషం.

దేశ భక్తినే శంకించారు – మిథాలీ

చీఫ్ కోచ్ రమేశ్ పొవార్ తనపైన చేసిన ఆరోపణలు దారుణమని…తన దేశభక్తినే శంకించేవిగా ఉన్నాయని మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది. రెండుదశాబ్దాల తన క్రికెట్ చరిత్రలో.. ఇదో చీకటి దినమని మిథాలీ పేర్కొంది.

గత 20 సంవత్సరాలుగా తాను పడిన కష్టం, చిందించిన స్వేదం, త్యాగం అన్నీ ఒక్కసారిగా గాలిలో కలసిపోయాయని…. ఆ దేవుడే తనకు శక్తిని ఇవ్వాలంటూ మిథాలీ ప్రాధేయపడింది.

ఇదిలా ఉంటే…. భారత మహిళాజట్టు కోచ్ గా భారత మాజీ ఆల్ రౌండర్ రమేశ్ పొవార్ పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. కోచ్ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నా…. ప్రస్తుత పరిస్థితుల్లో పొవార్ మరోసారి ఎంపిక కావడం అనుమానమే.

భారత మహిళా జట్టు శిక్షకునిగా రమేశ్ పొవార్ ఇన్నింగ్స్ ముగిసినా… మిథాలీ వివాదం ఏవిధంగా ముగుస్తుందన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  29 Nov 2018 10:14 AM GMT
Next Story