Telugu Global
NEWS

బయటకు రాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధులు

వారు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ముందుండే వారు.. అలాంటి టీకాంగ్రెస్ సీనియర్ అభ్యర్థులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించాల్సిన వారంతా, గడప దాటకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకరిద్దరు అడపా దడపా జిల్లాలో ఒకటి రెండు చోట్ల ప్రచారం చేస్తూ.. ఆ తరువాత నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎన్నో తర్జన భర్జనల అనంతరం మహా కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. కాంగ్రెస్ 97 స్థానాలకు […]

బయటకు రాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధులు
X

వారు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ముందుండే వారు.. అలాంటి టీకాంగ్రెస్ సీనియర్ అభ్యర్థులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించాల్సిన వారంతా, గడప దాటకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకరిద్దరు అడపా దడపా జిల్లాలో ఒకటి రెండు చోట్ల ప్రచారం చేస్తూ.. ఆ తరువాత నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఎన్నో తర్జన భర్జనల అనంతరం మహా కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. కాంగ్రెస్ 97 స్థానాలకు పైగా పోటీ చేస్తుంది. నామినేషన్ల పర్వానికి ముందు అభ్యర్థులను రెండు మూడు విడతలుగా ప్రకటించారు. ఆ తరువాత ప్రచారంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. సోనియా గాంధీ కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు.

కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ వంటి సీనియర్ నేతల పేర్లు వినిపించాయి. వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా ఏ ఒక్కరు రాష్ట్ర మంతటా తిరిగి ప్రచారం చేయడం లేదట. కాంగ్రెస్ సీనియర్లు అయిన వారంతా కేవలం తమ నియోజక వర్గానికే పరిమితమై, గెలుపుపైనే ప్రధాన దృష్టి పెట్టారట.

అయితే వీరు నియోజకవర్గానికే పరిమితం కావడానికి కారణాలున్నాయి. జానారెడ్డి గెలుపు ఈసారి అంత ఈజీ కాదని వార్తలొస్తున్నాయి. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నర్సింహాయ్య బలంగా ప్రచారం చేస్తుండడంతో జానారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బలమైన టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి హోరా హోరీ ఫైట్ ఇస్తున్నారు. ఇక డీకే అరుణ కూడా ఈసారి బలమైన పోటీని ఎదుర్కొంటోంది. గెలిస్తే మంత్రి, వీలుంటే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తుండడంతో వీరంతా ప్రస్తుతం నియోజకవర్గంలో గెలవడంపైనే దృష్టిపెట్టారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

First Published:  29 Nov 2018 5:26 AM GMT
Next Story