Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కి ఎమోషన్స్... రామ్ చరణ్ కి ఫైట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఎస్.ఎస్ రాజమౌళి ఈ భారీ మల్టీ స్టారర్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఈ షెడ్యూల్ లో వీరు యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ ని జరుపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ని రామ్ చరణ్ ఎన్టీఆర్ కంటే ముందుగా రెండు రోజుల్లో పూర్తి […]

ఎన్టీఆర్ కి ఎమోషన్స్... రామ్ చరణ్ కి ఫైట్స్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఎస్.ఎస్ రాజమౌళి ఈ భారీ మల్టీ స్టారర్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఈ షెడ్యూల్ లో వీరు యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ ని జరుపుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ని రామ్ చరణ్ ఎన్టీఆర్ కంటే ముందుగా రెండు రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాడట. ఇంతలో రాజమౌళి ఎన్టీఆర్ తో సీన్స్ ని చిత్రీకరించబోతున్నాడట. దీంతో వీరు మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్నారు. ఇక కథ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ కంటే కూడా రామ్ చరణ్ కి ఎక్కువ ఫైట్ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయట. అలాగే ఎన్టీఆర్ కి ఫైట్ సీన్స్ కంటే కూడా ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉంటాయట. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  30 Nov 2018 3:21 AM GMT
Next Story