Telugu Global
NEWS

పైసా విదల్చని బీజేపీ నాయకత్వం.... మొత్తుకుంటున్న అభ్యర్థులు

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే పైసా అవసరం. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు సరే.. మరి దళిత, గిరిజన బీజేపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సపోర్టు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. గత ఎన్నికల్లో టీడీపీ సహకారంతో బీజేపీ గట్టెక్కింది. ఈ సారి ఆ సపోర్టు లేదు. ఒంటిరిగానే బరిలోకి దిగిన బీజేపీ శ్రేణులకు ఆది నుంచి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే […]

పైసా విదల్చని బీజేపీ నాయకత్వం.... మొత్తుకుంటున్న అభ్యర్థులు
X

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే పైసా అవసరం. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు సరే.. మరి దళిత, గిరిజన బీజేపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సపోర్టు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు.

గత ఎన్నికల్లో టీడీపీ సహకారంతో బీజేపీ గట్టెక్కింది. ఈ సారి ఆ సపోర్టు లేదు. ఒంటిరిగానే బరిలోకి దిగిన బీజేపీ శ్రేణులకు ఆది నుంచి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. కొన్ని జిల్లాల్లో అసలు జెండా కట్టేవారు కూడా లేరంటే అతిశయోక్తి కాదు.

ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో గట్టెక్కుదామని భావించాయి బీజేపీ శ్రేణులు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినా…. పెద్దగా ఎవరూ స్పందించలేదు. దాంతో, గెలుపు తరువాత సంగతి.. పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునే పనిలో పడిపోయారు. ఎలాగొలా అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారు. ప్రచారం మొదలైంది. కొందరు ఆర్థికంగా బలంగా లేని అభ్యర్థులకు డబ్బుల కొరత వేధిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఫండింగ్ కు కొదవేమి ఉంటుందని చాలా మంది బీజేపీ అభ్యర్థులు భావించారు.

కానీ సీన్ రివర్స్ అవుతుందని వారు ఊహించలేకపోయారు. జాతీయ నేతల సభలు, పార్టీ నేతల సమావేశాలు తదితర ఖర్చులన్నీ నేరుగా జాతీయ నేతలే చూసుకుంటున్నారు. వీరి అనుయాయుల చేతుల మీదుగా ఖర్చు పెడుతున్నారు. దీంతో ఖంగుతినడం అభ్యర్థుల వంతవుతోంది. నియోజకవర్గాలవారీగా ఫండ్ ఇస్తే ఖర్చు పెట్టుకుంటామని చెబుతున్నా.. ఎవరూ ఆలకించడం లేదని వాపోతున్నారు అభ్యర్ధులు. పైసా కూడా విదల్చకపోతే ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి ఫండింగ్ లొల్లి ఏ పార్టీ వారికీ రాకూడదని బీజేపీ అభ్యర్థులు కోరుకుంటున్నారు.

First Published:  30 Nov 2018 5:37 AM GMT
Next Story