విరాట్ కొహ్లీ…. నీకిది తగునా?

  • మరో వివాదంలో విరాట్ కొహ్లీ…
  • నిక్కరు ధరించి టాస్ కు వెళ్లిన టీమిండియా కెప్టెన్
  • సోషల్ మీడియాలో కొహ్లీపై విమర్శల వర్షం

ఆస్ట్రేలియా పర్యటనలో భారత గౌరవం నిలిచేలా… హుందాగా వ్యవహరించాలంటూ… టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి… బీసీసీఐ పాలకమండలి సభ్యుల ఇచ్చిన సలహాలు, సూచనలు.. గాలిలో కలిసి పోయాయి.

వివాదాలను ఏరికోరి తెచ్చుకోడంలో తనకుతానే సాటిగా నిలిచే విరాట్ కొహ్లీ… టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే మరో వివాదంలో కేంద్రబిందువుగా నిలిచాడు.

నిక్కురుతోనే టాస్ కు….

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో…క్రికెట్ ఆస్ట్రేలియా లెవెన్ తో నాలుగురోజుల ప్రాక్టీస్ మ్యాచ్… టాస్ కు… కొహ్లీ…. ప్యాంట్స్ ధరించకుండా… నిక్కరు ధరించి రావడం చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ అంటేనే మర్యాదస్తుల క్రీడ. సాంప్రదాయలకు, హుందాతనానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రీడ. పాఠశాల స్థాయిలో జరిగే చిన్నచిన్న క్రికెట్ మ్యాచ్ ల్లో సైతం…. తెలుపు రంగు ప్యాంట్లు వేసుకొని…. టాస్ కార్యక్రమంలో పాల్గొనటం సాధారణ విషయం.

మంటగలసిన క్రికెట్ పరువు….

అలాంటిది…టీమిండియా కెప్టెన్ హోదాలో విరాట్ కొహ్లీ మాత్రం క్రికెట్ మర్యాద, సాంప్రదాయాలను విస్మరించి…షార్ట్స్ తో హాజరు కావడం పట్ల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా కొహ్లీ పై దుమ్మెత్తి పోశారు.

విరాట్ కొహ్లీ గొప్ప ఆటగాడే కావచ్చు, ప్రపంచ రికార్డులు తిరగరాయెచ్చు…అయితే …క్రికెట్ ఆటకంటే గొప్పవాడేమీ కాదని గుర్తుంచుకోవాలంటూ… ఓ అభిమాని చురకంటించారు.

ఇది…పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కే మాయని మచ్చంటూ మరో అభిమాని కొహ్లీ పై మండిపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ హుందాను, మర్యాదను కాపాడాల్సిన బాధ్యత …ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ పైన ఎంతైనా ఉందని…అయితే…కొహ్లీ మాత్రం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ….ఆటకే తలవంపులు తీసుకురావడం ఎంత వరకూ సబబని అంటున్నారు…