Telugu Global
NEWS

బస్సెక్కి.... మా ఊరికి టికెట్‌ ఇవ్వండి అంటే ఎలా?- పితానిపై బాబు రుసరుస

ఏపీ కలెక్టర్ల సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుసరుసలాడారు. పేదలు దరఖాస్తు చేసుకుంటున్నా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని పితాని చేసిన ఆరోపణ చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. రేషన్‌ కార్డులు కోరుతూ పేదలు మీ సేవాకేంద్రాల్లో దరఖాస్తుల ఇస్తే వాటిని అధికారులు పట్టించుకోవడం లేదని పితాని ఆరోపించారు. దీని వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారుల తీరు పేదలకు నష్టం చేసేలా ఉందని పితాని అభిప్రాయపడ్డారు. పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం […]

బస్సెక్కి.... మా ఊరికి టికెట్‌ ఇవ్వండి అంటే ఎలా?- పితానిపై బాబు రుసరుస
X

ఏపీ కలెక్టర్ల సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుసరుసలాడారు. పేదలు దరఖాస్తు చేసుకుంటున్నా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని పితాని చేసిన ఆరోపణ

చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. రేషన్‌ కార్డులు కోరుతూ పేదలు మీ సేవాకేంద్రాల్లో దరఖాస్తుల ఇస్తే వాటిని అధికారులు పట్టించుకోవడం లేదని పితాని ఆరోపించారు. దీని వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారుల తీరు పేదలకు నష్టం చేసేలా ఉందని పితాని అభిప్రాయపడ్డారు.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని పితాని అనడంతో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకున్నారు. రేషన్ కార్డులు ఎవరికి రాలేదు?. పేదలందరికీ ఇస్తున్నాం… అనవసరంగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. మీ దగ్గర స్పష్టమైన ఆధారాలుంటే ఇవ్వండి అంటూ మంత్రిపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ”మీ తీరు చూస్తుంటే బస్సు ఎక్కి ఊరి పేరు చెప్పకుండా మాఊరికి టికెట్‌ ఇవ్వండి” అని అడిగినట్టుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సీరియస్ అయినప్పటికీ మంత్రి పితాని మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను ఆధారాల్లేకుండా మాట్లాడను సర్‌… మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నా రేషన్ కార్డులు మంజూరు కానీ పేదల వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానైనా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు మంత్రి.

First Published:  30 Nov 2018 11:36 PM GMT
Next Story