Telugu Global
NEWS

కల్వకుంట్ల ఆస్తులపై బాంబు పేల్చిన మధుయాష్కీ

కేసీఆర్, కేటీఆర్ అక్రమ ఆస్తులపై మాజీఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన దోపిడీ అంటూ విమర్శలు గుప్పించారు. తేజరాజు అనే వ్యక్తికి చెందిన కంపెనీకి 1500 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టును ఎలాంటి టెండర్ లేకుండా ఇచ్చారని.. ఇందులో వచ్చిన కమీషన్ డబ్బులను కేటీఆర్ మలేషియాకు పంపించాడని ఆరోపించారు. ఆ మలేషియా నుంచి రీ ఇన్వెస్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ లో మలేషియా నుంచి పెట్టుబడులు […]

కల్వకుంట్ల ఆస్తులపై బాంబు పేల్చిన మధుయాష్కీ
X

కేసీఆర్, కేటీఆర్ అక్రమ ఆస్తులపై మాజీఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన దోపిడీ అంటూ విమర్శలు గుప్పించారు. తేజరాజు అనే వ్యక్తికి చెందిన కంపెనీకి 1500 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టును ఎలాంటి టెండర్ లేకుండా ఇచ్చారని.. ఇందులో వచ్చిన కమీషన్ డబ్బులను కేటీఆర్ మలేషియాకు పంపించాడని ఆరోపించారు. ఆ మలేషియా నుంచి రీ ఇన్వెస్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ లో మలేషియా నుంచి పెట్టుబడులు పెట్టించారని మధుయాష్కీ గౌడ్ దుమారం రేపారు.

ఈ సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ లో కేటీఆర్ కు 17లక్షల షేర్లు ఉన్నాయని మధుయాష్కీ ఆరోపించారు. సద్గురుకు మలేషియా, సింగపూర్ నుంచి నిధులు వస్తాయని.. అవన్నీ కేటీఆర్ కు కమీషన్ కింద వచ్చిన డబ్బులేనని అన్నారు. కేటీఆర్ కు వచ్చిన కమీషన్ ను మలేషియా, సింగపూర్, అమెరికాలోని ఫార్మాస్యూటికల్ కంపెనీలకు తరలిస్తారని.. ఆ డబ్బును మళ్లీ రీరూట్ చేసి సద్గురు లాంటి బినామీ హెల్త్ కంపెనీలకు తీసుకొస్తారని మధుయాష్కీ సంచలన విషయాలు వెల్లడించారు. ఇలా సంపాదించిన ఆస్తులతోనే కల్వకుంట్ల అభయ్ రామ్ ఆస్తి 2014లో 7 కోట్లు ఉంటే.. 2018 వచ్చేసరికి 41కోట్లు అయ్యిందని ఆరోపించారు. అంటే 424 పర్సెంట్ పైన పెరిగిందని మధుయాష్కీ ఆరోపించారు.

కేసీఆర్ ఏక్ నంబర్ అయితే.. కేటీఆర్ దస్ నంబర్ అయ్యాడని.. కేసీఆర్, కేటీఆర్, కవిత లు ఏవిధంగా తెలంగాణను దోచుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మధుయాష్కీ కోరారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెరిగాయని, దాని పై తాము చర్చకు సిద్ధమని.. కొండా లక్ష్మన్, జయశంకర్, దేశిని చినమల్లయ్య ఇంటిలో చర్చిద్దామని దమ్ముంటే రావాలని కేటీఆర్ కు మధుయాష్కీ సవాల్ విసిరారు.

First Published:  1 Dec 2018 5:45 AM GMT
Next Story