హాకీ ప్రపంచకప్ లో సూపర్ సండే బిగ్ ఫైట్

  • 3వ ర్యాంకర్ బెల్జియంకు 5వ ర్యాంకర్ భారత్ సవాల్
  • భువనేశ్వర్ కళింగ స్టేడియంలో కీలక సమరం
  • తొలిరౌండ్లో సౌతాఫ్రికాపై 5-0 గోల్స్ తో నెగ్గిన భారత్

హాకీ ప్రపంచకప్ గ్రూప్ -సీ లీగ్ లో అతిపెద్ద సమరానికి…భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ రెండోరౌండ్ మ్యాచ్ లో..ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంకు ..5వ ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది.

గ్రూప్ తొలిరౌండ్ పోటీల్లో సౌతాఫ్రికాను భారత్ 5-0తో చిత్తు చేస్తే…కెనడాను బెల్జియం 2-1 గోల్స్ తో అధిగమించడం ద్వారా పూర్తి పాయింట్లు సాధించింది.

రెండుజట్ల ఈ సమరం నువ్వానేనా అన్నట్లుగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు జరిగే పోటీలో నెగ్గిన జట్టే…గ్రూప్ టాపర్ గా నిలిచే అవకాశాలున్నాయి.

మూడువారాలపాటు సాగే ఈ టోర్నీలో… ప్రపంచ హాకీలోని 16 అత్యుత్తమ జట్లు తలపడుతున్నాయి. గ్రూప్ లీగ్ కమ్ క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ గా పోటీలు నిర్వహిస్తున్నారు.

ఆతిథ్య భారత్ 43 ఏళ్ల విరామం తర్వాత మరోసారి ప్రపంచ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది.