Telugu Global
NEWS

నెక్స్ట్ టార్గెట్ ఏపీనే.... ఆలోచించి తెలంగాణలో ఓటేయండి

విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా సాధించలేకపోయిన ఈ చేతగాని ముఖ్యమంత్రి ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తా అనడం విచిత్రంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు చేసే తప్పులను, బినామీలు చేసే అవినీతిని తప్పుదారి పట్టించేందుకు టీవీ చానళ్లు అత్యుత్సాహం చూపుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాటు మోడీ చంకలో ఉన్న చంద్రబాబును విమర్శించని పత్రికలు ఇప్పుడు…మోడీ చేతిలో జగన్‌ అని రాస్తున్నాయని మండిపడ్డారు. భూములు ఇస్తున్నారని, అసెంబ్లీ ప్రసారహక్కులు ఇస్తున్నారని, కోట్ల రూపాయలు ఇస్తున్నారని… చంద్రబాబు కాళ్ల […]

నెక్స్ట్ టార్గెట్ ఏపీనే.... ఆలోచించి తెలంగాణలో ఓటేయండి
X

విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా సాధించలేకపోయిన ఈ చేతగాని ముఖ్యమంత్రి ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తా అనడం విచిత్రంగా ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు చేసే తప్పులను, బినామీలు చేసే అవినీతిని తప్పుదారి పట్టించేందుకు టీవీ చానళ్లు అత్యుత్సాహం చూపుతున్నాయన్నారు.

నాలుగేళ్ల పాటు మోడీ చంకలో ఉన్న చంద్రబాబును విమర్శించని పత్రికలు ఇప్పుడు…మోడీ చేతిలో జగన్‌ అని రాస్తున్నాయని మండిపడ్డారు. భూములు ఇస్తున్నారని, అసెంబ్లీ ప్రసారహక్కులు ఇస్తున్నారని, కోట్ల రూపాయలు ఇస్తున్నారని… చంద్రబాబు కాళ్ల వద్ద జర్నలిజాన్ని తాకట్టు పెట్టవద్దని ఒక పత్రికకు రోజా సూచించారు.

చంద్రబాబు దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని…. జూన్ 8న ఇదే ఏపీ కాంగ్రెస్‌ చార్జీషిట్‌ విడుదల చేసిందని…. అలాంటి చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్‌ను రాహుల్‌గాంధీ విమర్శించడం బట్టి రాహుల్‌ ఎంత అజ్ఞానో అర్థమవుతోందన్నారు.

చంద్రబాబుతో స్నేహం చేయగానే రాహుల్ కూడా నిజాలు మాట్లాడడం మానేసి చంద్రబాబు రాసిచ్చిన అబద్దాల స్క్రిప్ట్‌ను చదువుతున్నారని రోజా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌- టీడీపీ కూటమి కట్టాయని … అక్కడ కూటమిని గెలిపిస్తే తర్వాత ఆంధ్రా ప్రజలను ముంచేందుకు ఈరెండు పార్టీలు కలిసి వస్తాయని రోజా వ్యాఖ్యానించారు. కాబట్టి ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు.

బలమైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు తిరిగి మరోసారి రెండు రాష్ట్రాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందన్నారు. బ్యాంకులను 6వేల కోట్లకు ముంచిన సుజనాచౌదరిపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీశారు.

అధికారంలో ఉన్న పార్టీని,ప్రజలను మోసం చేస్తున్న పార్టీని విమర్శించడం మానేసి ప్రతిపక్ష వైసీపీపై పవన్‌ కల్యాణ్ ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ గురించి పవన్‌ కల్యాణ్ ఒకటి మాట్లాడితే తాము కూడా పది మాట్లాడాల్సి ఉంటుందన్నారు.

జగన్‌పై జరిగిన తరహాలోనే లోకేష్‌పై దాడి జరిగి ఉంటే చంద్రబాబు ఇలాగే కోడికత్తి అని మాట్లాడేవారా అని ప్రశ్నించారు. వైఎస్ మరణం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే జగన్‌ను కూడా పొట్టనపెట్టుకోవాలని చంద్రబాబు నీచరాజకీయం చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు… ఆ అనుభవంతో ప్రజలకు సేవ చేసి నెగ్గవచ్చు కదా అని ప్రశ్నించారు.

జగన్‌ను హత్య చేసేందుకు చేసిన కుట్రలో భాగస్వామ్యులైన వారు, జగన్‌ నెత్తురు కళ్ల చూసిన టీడీపీ నేతలు ఇంతకు ఇంత అనుభవించి తీరుతారని రోజా వ్యాఖ్యానించారు. జరుగుతున్న దారుణాలను దేవుడు చూస్తూనే ఉన్నారన్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత 200 కోట్లకు బ్యాంకులను మోసం చేశారనగానే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు… మరి సుజనాచౌదరి ఏకంగా ఆరు వేల కోట్లకు బ్యాంకులను ముంచితే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని రోజా ప్రశ్నించారు.

First Published:  1 Dec 2018 9:10 AM GMT
Next Story