Telugu Global
Cinema & Entertainment

సుమంత్ కు రానా గొంతు సాయం

తెలుగు సినిమాల్లో వాయిస్ ఓవర్లు కామన్. ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇచ్చి తమ మధ్య స్నేహబంధాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సుమంత్-రానా కూడా  చేరిపోయారు. సుమంత్ నటిస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమాకు రానా వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమాకు వాయిస్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. సినిమా స్టార్టింగ్ లోనే వాయిస్ ఓవర్ రావడంతో పాటు మధ్యమధ్యలో కూడా అక్కడక్కడ కీలక సందర్భాల్లో వాయిస్ […]

సుమంత్ కు రానా గొంతు సాయం
X

తెలుగు సినిమాల్లో వాయిస్ ఓవర్లు కామన్. ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇచ్చి తమ మధ్య స్నేహబంధాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సుమంత్-రానా కూడా చేరిపోయారు. సుమంత్ నటిస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమాకు రానా వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.

మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమాకు వాయిస్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. సినిమా స్టార్టింగ్ లోనే వాయిస్ ఓవర్ రావడంతో పాటు మధ్యమధ్యలో కూడా అక్కడక్కడ కీలక సందర్భాల్లో వాయిస్ ఓవర్ అవసరం. అందుకే రానా లాంటి బేస్ వాయిస్ అయితే దీనికి సరిపోతుంది మేకర్స్ నిర్ణయించారు.

సుమంత్ కు రానా మంచి స్నేహితుడు. అంతేకాదు, ఒక విధంగా ఇద్దరూ బంధువులు కూడా అవుతారు. అందుకే సుమంత్ అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రానా ఒప్పుకున్నాడు.

First Published:  1 Dec 2018 10:56 AM GMT
Next Story