Telugu Global
Cinema & Entertainment

రోషన్ రెండవ సినిమా సిద్ధం అవుతుంది

శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ 2016లోనే “నిర్మలా కాన్వెంట్” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ తరువాత పై చదువుల కోసం రోషన్ లాస్ ఏంజిల్స్ కి వెళ్ళాడు. ప్రస్తుతం అక్కడ చదువు పూర్తి అవ్వడం తో రోషన్ తిరిగి హైదరబాద్ వచ్చేశాడు. ఇదిలా ఉంటే రోషన్ కోసం శ్రీకాంత్ ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేసాడు అని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్టు […]

రోషన్ రెండవ సినిమా సిద్ధం అవుతుంది
X

శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ 2016లోనే “నిర్మలా కాన్వెంట్” అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ తరువాత పై చదువుల కోసం రోషన్ లాస్ ఏంజిల్స్ కి వెళ్ళాడు. ప్రస్తుతం అక్కడ చదువు పూర్తి అవ్వడం తో రోషన్ తిరిగి హైదరబాద్ వచ్చేశాడు.

ఇదిలా ఉంటే రోషన్ కోసం శ్రీకాంత్ ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేసాడు అని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఒక మంచి డైరెక్టర్ నే సెట్ చేశాడట శ్రీకాంత్.

ఇక తన రెండో కుమారుడు రోహన్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడని శ్రీకాంత్ అన్నాడు. ప్రభుదేవా కొడుకుగా ఓ సినిమాలో కనిపించనున్నాడని చెప్పాడు. మొత్తానికి తన ఇద్దరు కొడుకుల్ని ఇండస్ట్రీ లోకి తీసుకొద్దామని శ్రీకాంత్ గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

First Published:  1 Dec 2018 6:05 AM GMT
Next Story