Telugu Global
NEWS

చేవెళ్ల చెల్లెమ్మ పుత్రుడు కూడా జై సీబీఎన్‌

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వైఎస్‌ ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేవెళ్ల చెల్లెమ్మ అంటూ పిలుచుకునేవారు. ఆమెను ఏకంగా హోంమంత్రిని చేశారు. జగన్‌ను కేసుల్లో ఇరికించే సమయంలో ఈ చేవెళ్ల చెల్లెమ్మను కూడా ఇరికించేశారు. అందులో చంద్రబాబు పాత్ర కూడా కీలకమేనన్నది అందరికీ తెలిసిందే. అలాంటి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు చంద్రబాబుకు జై కొడుతోంది. టీడీపీతో పొత్తు ఖాయం కాకముందు వరకు టీవీ చర్చల్లో పాల్గొని చంద్రబాబు విధానాలను విమర్శించిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు […]

చేవెళ్ల చెల్లెమ్మ పుత్రుడు కూడా జై సీబీఎన్‌
X

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వైఎస్‌ ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేవెళ్ల చెల్లెమ్మ అంటూ పిలుచుకునేవారు. ఆమెను ఏకంగా హోంమంత్రిని చేశారు. జగన్‌ను కేసుల్లో ఇరికించే సమయంలో ఈ చేవెళ్ల చెల్లెమ్మను కూడా ఇరికించేశారు. అందులో చంద్రబాబు పాత్ర కూడా కీలకమేనన్నది అందరికీ తెలిసిందే.

అలాంటి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు చంద్రబాబుకు జై కొడుతోంది. టీడీపీతో పొత్తు ఖాయం కాకముందు వరకు టీవీ చర్చల్లో పాల్గొని చంద్రబాబు విధానాలను విమర్శించిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాలకు వస్తున్నారు. రాజేంద్రనగర్‌ టికెట్‌ను కార్తీక్ రెడ్డి ఆశించారు. కానీ పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. తొలుత రాజీనామా చేస్తానని, టీడీపీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామని సవాల్‌ చేసిన కార్తీక్‌ రెడ్డి ఆతర్వాత సైలెంట్‌ అయ్యారు.

ఇప్పుడు ఏకంగా టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. చంద్రబాబు రాజేంద్రనగర్‌కు వస్తుండడంతో స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కార్తీక్‌ రెడ్డి చంద్రబాబును కీర్తించారు. చంద్రబాబును కేసీఆర్‌ విమర్శించడం పద్దతి కాదన్నారు. చంద్రబాబును కేసీఆర్‌ వేలెత్తి చూపిస్తుంటే జనం నవ్వుకుంటున్నారని కార్తీక్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఈ హైదరాబాద్‌ నగర అభివృద్ధికి చేసిన కృషి అందరికీ తెలుసన్నారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తామని కార్తీక్‌ రెడ్డి ప్రకటించారు. గతంలో కార్తీక్ రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డి టీడీపీలో పనిచేశారు. బహుశా ఆ పాత ప్రేమ వల్లే కార్తీక్ రెడ్డి జై సీబీఎన్ అంటున్నారేమో.

First Published:  1 Dec 2018 5:24 AM GMT
Next Story