సైనా-కశ్యప్ బ్యాండ్ బాజాకు కౌంట్ డౌన్

  • పెళ్లి పత్రికల పిలుపుతో బ్యాడ్మింటన్ జోడీ బీజీబిజీ

భారత బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల ప్రేమవివాహానికి ముహూర్తం కుదరడమే కాదు… పెళ్లికి సమయం దగ్గరపడటంతో …శుభలేఖలు పంచడంలో ఇద్దరూ బీజీబీజీగా మారిపోయారు.

 హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కెటీఆర్ కు…సైనా, కశ్యప్ జంటగా వెళ్లి తమ వివాహా ఆహ్వానపత్రం అందచేశారు.

డిసెంబర్ 16 న జరిగే తమ పెళ్లికి హాజరు కాలేకపోయినా… రిసెప్షన్ కు తప్పక రావాలంటూ అభ్యర్థించారు.

2005 నుంచి హైదరాబాద్ గోపీచంద్ అకాడమీలో కలసిసాధన చేసిన కశ్యప్, సైనా…గత పదేళ్లుగా డేటింగ్ చేస్తూ వచ్చారు.

2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన సైనా నెహ్వాల్ కు…. ప్రపంచ బ్యాడ్మింటన్ సిల్వర్ మెడల్, రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం తో పాటు…. 20 సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన ఘనత ఉంది.

పారుపల్లి కశ్యప్ కు సైతం…కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్ లో స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉంది.

వివాహం తర్వాత సైతం…బ్యాడ్మింటన్ లీగ్ తో పాటు…అంతర్జాతీయ పోటీలలో సైనా, కశ్యప్ ల జోడీ కొనసాగే అవకాశం ఉంది.