Telugu Global
Cinema & Entertainment

నానికి విలన్ గా సిద్దార్థ్?

న్యాచురల్ స్టార్ నాని ఇటివలే విక్రం కే కుమార్ సినిమాకి ఓకే చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే విక్రం కే కుమార్ ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ పనులు పూర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో యంగ్ విలన్ గా నటించేందుకు హీరో సిద్దార్థ్ ని అడిగాడు అంట విక్రం కే కుమార్. సిద్దార్థ్ […]

నానికి విలన్ గా సిద్దార్థ్?
X

న్యాచురల్ స్టార్ నాని ఇటివలే విక్రం కే కుమార్ సినిమాకి ఓకే చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే విక్రం కే కుమార్ ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ పనులు పూర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో యంగ్ విలన్ గా నటించేందుకు హీరో సిద్దార్థ్ ని అడిగాడు అంట విక్రం కే కుమార్. సిద్దార్థ్ కూడా కథ మొత్తం విన్నాక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని తెలుస్తుంది.

తెలుగు ప్రేక్షకులకి “బొమ్మరిల్లు” “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” “ఓయ్” వంటి సినిమాల ద్వారా సిద్దార్థ్ బాగా చేరువయ్యాడు. కానీ గత కొంత కాలంగా సిద్దార్థ్ తెలుగు సినిమాలు ఏమి చెయ్యట్లేదు. ప్రస్తుతం సిద్దార్థ్ కేవలం తమిళ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. మరి చాలా కాలం తరువాత తెలుగు లో నటించడానికి రెడీ అయిన సిద్దార్థ్ విలన్ గా మెప్పిస్తాడో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  30 Nov 2018 10:25 PM GMT
Next Story