Telugu Global
Cinema & Entertainment

దేవి శ్రీ ప్రసాద్ ను వద్దంటున్న రామ్ చరణ్?

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను…. వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు మెగాస్టార్ నుంచి మెగా ఆఫర్ అందుకున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకోవాలి అని కొరటాల శివ అనుకుంటున్నాడట. ఎందుకంటే కొరటాల శివ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ గా […]

దేవి శ్రీ ప్రసాద్ ను వద్దంటున్న రామ్ చరణ్?
X

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను…. వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు మెగాస్టార్ నుంచి మెగా ఆఫర్ అందుకున్నాడు కొరటాల శివ.

ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకోవాలి అని కొరటాల శివ అనుకుంటున్నాడట. ఎందుకంటే కొరటాల శివ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు.

అయితే చిరంజీవితో రూపొందించబోతున్న నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ వద్దని చరణ్ భావిస్తున్నాడట. ఈ సినిమా ని రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. అందుకే ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ని పెట్టుకుందాం అని కొరటాల శివకి చెప్పాడట రామ్ చరణ్.

అమిత్ త్రివేది ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తున్న “సై రా” సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కానీ సినిమా ఓపెనింగ్ అయితే గాని ఈ సినిమాకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనే అంశం తెలియదు.

First Published:  2 Dec 2018 2:45 AM GMT
Next Story