Telugu Global
Cinema & Entertainment

క్లాస్ సాంగ్ తో రాబోతున్న చరణ్

మొదట్లో అన్నీ మాస్ సినిమాలే తీశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రానురాను ట్రెండ్ మార్చాడు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కాస్త క్లాస్ టచ్ కూడా ఇస్తున్నాడు. జయ జానకి నాయక సినిమాలో అదే ఫార్మాట్ ఫాలో అయిన బోయపాటి ఇప్పుడు చరణ్ తో తీస్తున్న వినయ విధేయ రామ సినిమాలో కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మాస్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తర్వాత […]

క్లాస్ సాంగ్ తో రాబోతున్న చరణ్
X

మొదట్లో అన్నీ మాస్ సినిమాలే తీశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రానురాను ట్రెండ్ మార్చాడు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కాస్త క్లాస్ టచ్ కూడా ఇస్తున్నాడు. జయ జానకి నాయక సినిమాలో అదే ఫార్మాట్ ఫాలో అయిన బోయపాటి ఇప్పుడు చరణ్ తో తీస్తున్న వినయ విధేయ రామ సినిమాలో కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మాస్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తర్వాత కార్తీక సోమవారం సందర్భంగా క్లాస్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు పాటల్లో కూడా అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నారు. ముందుగా క్లాస్ సాంగ్ విడుదల చేస్తారు. ఆ తర్వాత మాస్ బీట్ రిలీజ్ చేస్తారు.

3వ తేదీన సాయంత్రం 4 గంటలకు వినయ విధేయ రామ సినిమా నుంచి క్లాస్ సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ లో మాస్ సాంగ్స్ తో పాటు మిగతా పాటల్ని విడుదల చేస్తారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

First Published:  1 Dec 2018 7:02 PM GMT
Next Story